Kantara Chapter 1 In English : 31న ‘కాంతార ఛాప్టర్ 1’ ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్

రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' ఇంగ్లీష్ వెర్షన్‌ను అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిలింస్ ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద $750 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా, ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Kantara Chapter 1 In English : 31న ‘కాంతార ఛాప్టర్ 1’ ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్

విధాత : కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మూవీ భారతీయ భాషాల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 3న సినిమా విడుదలైంది. అపూర్వ ప్రేక్షకాదరణతో ఇప్పటికే 750కోట్ల వసూళ్ల వైపు దూసుకెలుతున్న కాంతార చాప్టర్ 1 పాన్ ఇండియా సహా, ప్రాంతీయ భాషా చిత్రాల వసూళ్ల రికార్డులను బద్దలు కొడుతూ పలు కొత్త రికార్డులను నమోదు చేసింది. తాజాగా ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగానూ రికార్డు సాధించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం కాంతారా చాప్టర్ 1 మూవీ ఇంగ్లీష్, స్పానిష్ వర్షన్ లను మేకర్స్ సిద్దం చేశారు. ఈ నెల 31న కాంతారా చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ ను విడుదల చేయనున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలీమ్స్ ప్రకటించింది.

సరిహద్దులు, భాషలకు అతీతంగా ప్రతిధ్వనించే ఒక దివ్య గాథ కాంతారా చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ రూపంలో ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లుగా హోంబలే ఫిలీమ్స్ పేర్కొంది. విశ్వాసం, సంస్కృతి, భక్తి యొక్క ఇతిహాస ప్రయాణాన్ని వాటి అన్ని మార్గాల్లో అనుభవించండి అంటూ ఎక్స్ లో తెలిపింది. అయితే కాంతారా చాప్టర్ 1ఇంగ్లీష్ వర్షన్ మూవీ నిడివిని అరగంటకు పైగా తగ్గించారు. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ రన్ టైమ్ 2.14 గంటలు మాత్రమే. అంటే 35 నిమిషాల సీన్స్ తీసేశారు. ఇకపోతే కాంతారా చాప్టర్ వన్ ఇంగ్లీష్ వర్షన్ విడులయ్యే ఈ నెల 31రోజునే థియేటర్లలోకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల కానుంది. అలాగే మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సైతం విడుదల కానుండటం గమనార్హం.