Akhil Akkineni : మరో వేడుకకు రెడీ అయిన అక్కినేని కుటుంబం.. అఖిల్ పెళ్లిపై అప్డేట్
అఖిల్, జైనాబ్ రెండేండ్లుగా ప్రేమలో ఉన్నారని, రీసెంట్‌గా నాగార్జున ఇంట్లోనే వీరి నిశ్చితార్థ వేడుక జరిగిందని, పెళ్లి వచ్చే ఏడాది జరుగనున్నట్లు సమాచారం.

Akhil Akkineni : అక్కినేని ఇంట మరో వేడుకకు రెడీ అయింది. మరో వారం రోజుల్లో నాగ చైతన్య శోభిత జంట ఓ ఇంటి వారవుతుండగా తాజాగా నాగార్జున మరో ఆసక్తికరమైన వార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిన్న కుమారుడు అఖిల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తన కొత్త కోడలిని పరిచయం చేయడంతో పాటు ఇప్పటికే అఖిల్‌కు, జైనాబ్ రావ్‌జీకి నిశ్చితార్ధం జరిగినట్లు ప్రకటించాడు.
ఈ సందర్భంగా నాగార్జున జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది.. ఈ యువ జంటను అశీర్వదించాలని కోరారు. ఇదిలాఉండగా జైనాబ్ రావ్‌జీ మంచి చిత్రకారిణి. పుట్టింది, పెరిగింది హైద్రాబాద్ అయినప్పటికీ ఎక్కువ వీదేశాల్లో గడిపింది. అఖిల్, జైనాబ్ రెండేండ్లుగా ప్రేమలో ఉన్నారని, రీసెంట్‌గా నాగార్జున ఇంట్లోనే వీరి నిశ్చితార్థ వేడుక జరిగిందని, పెళ్లి వచ్చే ఏడాది జరుగనున్నట్లు సమాచారం. అయితే అఖిల్‌కు ఆరేండ్ల క్రితమే ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనుమరాలితో ఎంగగేజ్మెంట్ జరిగినప్పటికీ పెళ్లి జరుగలేదు.