Allu Arjun| మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న అల్లు అర్జున్.. వారికి రూ.10 ల‌క్ష‌లు సాయం

Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టుడిగానే కాదు మంచి మ‌న‌సున్న వ్యక్తిగా అంద‌రి హృద‌యాలని గెలుచుకుంటాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి తాను ఉన్నాన‌నే అభ‌యం ఇస్తుంటాడు. బ‌న్నీ ఇప్ప‌టికే చాలా సార్లే అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. అయితే తాజ‌గా ఆయ‌న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కి

  • By: sn    cinema    May 10, 2024 8:15 AM IST
Allu Arjun| మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న అల్లు అర్జున్.. వారికి రూ.10 ల‌క్ష‌లు సాయం

Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టుడిగానే కాదు మంచి మ‌న‌సున్న వ్యక్తిగా అంద‌రి హృద‌యాలని గెలుచుకుంటాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి తాను ఉన్నాన‌నే అభ‌యం ఇస్తుంటాడు. బ‌న్నీ ఇప్ప‌టికే చాలా సార్లే అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. అయితే తాజ‌గా ఆయ‌న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కి రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి సొంత భవనం కట్టాలని, మెంబర్స్ అందరికి హెల్త్ కేర్ ఉండే విధంగా చేయాల‌ని ఇప్పుడు వారు నిధులు సమీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేష‌న్‌కి నిధులు అందించ‌గా, బ‌న్నీ కూడా ఆ లిస్ట్‌లో ఇచ్చారు. బ‌న్నీ మంచి మ‌న‌సు చేసుకొని రూ.10 లక్షలను విరాళంగా అందించినందుకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆయనకు ధన్యవాదాలు తెలియ‌జేసింది.

ఇక తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌ను క‌లిశారు. డైరెక్టర్స్ డేకి వీలు చూసుకొని రావాల్సిందిగా కోరారు. ఇందుకు బ‌న్నీ సానుకూలంగా స్పందించారు. ద‌ర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని ప్రతి ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా మే 4న చేయాల్సి ఉండ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా వేశారు. అయితే ఆ రోజు సింపుల్ గా దాసరిని స్మరిస్తూ ఆయనకు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి డైరెక్టర్ డే సెలబ్రేట్ చేసుకున్నారు . ఇక డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ను ఈ నెల‌ 19న సాయంత్రం ఆరు గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించ‌నున్నారు. ఈ ఈవెంట్‌కి పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు హాజ‌రు కాబోతున్నారు.

ఇక ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తుంది. మెల్ల‌గా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా మొద‌లు పెట్టారు. పుష్ప సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన అల్లు అర్జున్ ఇక పుష్ప 2తో ఆస్కార్ అందుకోవాల‌నే క‌సితో ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానుల‌లో అయితే భారీ అంచ‌నాలే ఉన్నాయి