Anasuya Bharadwaj|అలా బట్టలు వేసుకుంటే మానభంగం చేస్తారా.. అనసూయ కామెంట్స్ వైరల్
Anasuya Bharadwaj| జబర్ధస్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఇప్పుడు నటిగా కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉం

Anasuya Bharadwaj| జబర్ధస్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఇప్పుడు నటిగా కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇక పలు కాంట్రవర్సీలలో కూడా ఇరుక్కుంటుంది. కొందరు హీరోల ఫ్యాన్స్‌తో యుద్ధానికి దిగుతుంటుంది. వారు చేసే ట్రోల్స్‌కి ధీటుగా బదులిస్తుంటుంది. తాజాగా మహిళలు ధరించే దుస్తులు వల్లనే మానభంగాలు జరుగుతున్నాయనే వాదనకు వ్యతిరేకంగా అనసూయ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సమాజంలో నేరాలకు అమ్మాయిల డ్రెస్సింగ్ కారణం అంటే అనసూయ ఏ మాత్రం ఒప్పుకోదు. తాజాగా అనసూయ అభిమాని ఒకరు తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అమ్మాయిలు స్కర్ట్ వేసినా.. లేదా సంప్రదాయంగా దుస్తులు వేసినా.. ఇంటి నుంచి బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా కూడా మానభంగానికి గురవుతున్నారు. అమ్మాయిలు ధరించే దుస్తుల వలన కాదు మానభంగం జరిగేది, మన మైండ్ సెట్ వలన. అది మార్చుకుంటే మహిళలపై రేపులు ఆగుతాయి అంటూ సదరు పోస్ట్‌లో ఉంది. దీనిపై అనసూయ స్పందిస్తూ..నా చుట్టూ ఉండే వాళ్లు, నన్ను అభిమానించే వాళ్లు ఎవరు కూడా ఫ్యాన్ పేజీల ద్వారా ఎవరిని దూషించరు. ఎవరిని టార్గెట్ చేయరు. ఎవరిని ట్రోల్ చేయరు. ఎవరిని రెచ్చగొట్టరు.
వారు అనవసరంగా ఎవరిని అగౌరవపరచరు. వీళ్లు వారి భాధ్యతల నుంచి పారిపోరు. మంచి మనసుతో ఉండే వారిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది అని అనసూయ రాసుకొచ్చింది.కొందరు ఫ్యాన్ పేజెస్ మెయింటైన్ చేసేవారు అనవసరంగా ఇతరులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జంతువుల మాదిరిగా బిహేవ్ చేసిన కూడా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. నా చుట్టూ ఉన్న మంచి మనుషులకి అండగా ఉంటాను, వారిని ప్రేమిస్తాను అని అనసూయ తెలియజేసింది. అంటే మానభంగాలకు యువతుల డ్రెస్సింగ్ కారణం కాదని ఆమె పరోక్షంగా తెలిపినట్టు అయింది. ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప 2లో దాక్షాయిణిగా డీగ్లామర్ రోల్ చేస్తుంది..అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.