Anasuya| అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ యాంకర్‌గా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు నటిగా అదరగొడుతుంది. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు బుల్లితెరపై మొదటి గ్లామరస్ యాంకర్ ఈమె కాగా, అ
Anasuya| అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ యాంకర్‌గా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు నటిగా అదరగొడుతుంది. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు బుల్లితెరపై మొదటి గ్లామరస్ యాంకర్ ఈమె కాగా, అనసూయకు హీరోయిన్స్ కి తగ్గని ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ అమ్మడు తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప2. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందుతుంది. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇక ఈ చిత్రం నుండి అనసూయ బర్త్ డే సందర్భంగా అనసూయ లుక్ విడుదలైంది.
దాక్షాయణిగా అనసూయ లుక్ అదిరింది.ఫస్ట్ పార్ట్ లో విలన్స్ అంటే మంగళం శ్రీను పాత్ర చేసిన సునీల్ భార్య దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది అనసూయ . అయితే క్లైమాక్స్ లో మంగళం శ్రీనుని దాక్షాయణి బ్లేడ్ తో పీక కోసేసినట్టు చూపించారు. ‘పుష్ప’ పై పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యేది దాక్షాయణి పాత్ర అని చెప్పాలి. ‘మరి మంగళం శ్రీను పాత్ర సీక్వెల్లో ఉంటుందా? లేదా?’ అనేది తెలియదు కాని అనసూయ పాత్ర మాత్రం పుష్ప2లో మరింత పవర్ ఫుల్‌గా ఉంటుంది. దాక్షాయణి పాత్ర లుక్ ఎలా ఉండబోతుందో ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్.
పోస్టర్లో అనసూయ మరోసారి రఫ్ లుక్ లో కనిపిస్తుంది. ఆమె చుట్టూ రౌడీల గుంపు ఉండగా, ఈ అమ్మడు మాత్రం పాన్ పరాక్ నవుల్తూ దర్జాగా టేబుల్ పై కూర్చొని రిలాక్స్ మూడ్‌లో కనిపిస్తుంది. ఆమె ఎదురుగా మందు బాటిల్ కూడా ఉంది. చూస్తుంటే ‘పుష్ప 2’ లో దాక్షాయణి పాత్రని మరింత మాస్ గా చూపించబోతున్నారు అని అర్ధమవుతుంది. ఇక అనసూయ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కేక్ కట్ చేసి వాటర్ లో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఈఫోటోల్లో రంగమ్మత్త యెల్లో కలర్ టాప్, జీన్స్ షార్ట్ వేసుకొని పిక్కలు చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.