Suma| సుమ‌ని న‌మ్మి మోసపోయాం.. మాకు న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళ‌న‌

Suma| యాంక‌ర్ సుమ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రు. టీవీ షోలు, టాక్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, యాడ్స్ ఇలా రెండు చేతులా సంపాదిస్తూ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది సుమ‌. అయితే సుమ ఒక‌ప్పుడు వివాదాల‌లో పెద్ద‌గా నిలిచేది కాదు. కాని ఈ మ‌ధ్య సుమ‌ని దుర‌దృష్టం బా

  • By: sn    cinema    Aug 07, 2024 1:35 PM IST
Suma| సుమ‌ని న‌మ్మి మోసపోయాం.. మాకు న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళ‌న‌

Suma| యాంక‌ర్ సుమ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రు. టీవీ షోలు, టాక్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, యాడ్స్ ఇలా రెండు చేతులా సంపాదిస్తూ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది సుమ‌. అయితే సుమ ఒక‌ప్పుడు వివాదాల‌లో పెద్ద‌గా నిలిచేది కాదు. కాని ఈ మ‌ధ్య సుమ‌ని దుర‌దృష్టం బాగా వెంటాడుతుంది. సందర్బోచితంగాను, అసందర్భోచితంగాను క్యాజువల్‌గా మాట్లాడిన కూడా ఆమెకి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా సుమ రియల్ ఎస్టేట్ వివాదంలో ఇరుక్కుపోయింది. గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భవన నిర్మాణాలను చేపట్టింది.

అయితే ఈ వెంచర్ కోసం ఆ సంస్థ‌ భారీగా ప్రమోషన్స్ చేసి వినియోగదారులను ఆకర్షించారు. ఆ రేంజ్‌లో ప్ర‌మోష‌న్స్ చేయ‌డంతో చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఇన్నాళ్లు తాము దాచుకున్న డ‌బ్బుల‌ని ఈ వెంచర్ వారికి క‌ట్టి ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. అట్టహాసంగా ప్రమోషన్స్ చేసిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ యాంకర్ సుమను తమ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవ‌డంతో వినియోగదారుల‌కి కాస్త న‌మ్మ‌కం వ‌చ్చింది. దాంతో అంద‌రు భారీగా డ‌బ్బులు పోసి ప్లాట్‌లు కొనుగోలు చేశారు. అయితే గ‌డువు ముగిసిన కూడా అప్ప‌జెప్ప‌క‌పోవ‌డంతో అందరికి అనుమానం వ‌చ్చింది. అయితే గ‌ట్టిగా అడుగుదామ‌ని అనుకునే స‌రికి కంపెనీ వారు బిచాణా ఎత్తేసి పరారీలో ఉండటంతో వినియోగదారులు బాధితులుగా మారారు.

చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతిలో ప్లకార్డులు పట్టుకొని రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏకంగా 88 కోట్లు కట్టించుకొని బాధితులకు ఆ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బాధితులు కొందరు ఓ మీడియాతో మాట్లాడూతూ… ‘రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్ వన్ బిల్డింగ్స్ చూశానని, ఫేజ్ 2 కూడా త్వరలో కడుతామని సుమతో ప్రచారం చేయించడం వల్లే న‌మ్మి సంస్థలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన‌ట్టు తెలిపారు . మ‌రో బాధితుడు మాట్లాడుతూ.. యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్ల వాటికి ఆకర్షితులమయ్యాం. పెద్ద కంపెనీ కావడంతో పాటు తక్కువ ధరకు ఇస్తానని చెప్ప‌డంతో మేము ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశాం. అయితే సుమను తప్పు పట్టడం లేదు. కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకొంటున్నాం అని బాధితులు చెబుతున్నారు.