Suma:సుమ అలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం మీకు తెలుసా?
Suma: తెలుగులో ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన కూడా సుమకి ఉన్న గుర్తింపు వేరే లెవల్. స్టార్ హీరోయిన్‌ని మించిన క్రేజ్ ఆమె సొంతం. మలయాళీ అయిన కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. అసలు సుమకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచనలే లేదట. కాని తన తల్లి కోరిక మేరకు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాప్ యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతుంది. అయితే సుమ మొదట్లో హీరోయిన్‌గా కూడా చేసింది. ఆ తర్వాత పలు చిత్రాలలో […]

Suma: తెలుగులో ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన కూడా సుమకి ఉన్న గుర్తింపు వేరే లెవల్. స్టార్ హీరోయిన్‌ని మించిన క్రేజ్ ఆమె సొంతం. మలయాళీ అయిన కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. అసలు సుమకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచనలే లేదట. కాని తన తల్లి కోరిక మేరకు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాప్ యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతుంది. అయితే సుమ మొదట్లో హీరోయిన్‌గా కూడా చేసింది. ఆ తర్వాత పలు చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలో సుమ వక్కంతం వంశీ సరసన కథానాయికగా నటించిన సుమ ఈ చిత్రంతో పెద్ద విజయం అందుకోలేకపోయింది.
కొద్ది రోజుల క్రితం జయమ్మ పంచాయితీ అం ప్రేక్షకులని పలకరించిది. ఈ సినిమా కోసం సుమ చాలా కష్టపడింది. చిత్రంపై న్నో ఆశలు పెట్టుకున్నా కూడా ఆ సినిమా ఏమాత్రం ఆదరణకు నోచుకోలేదు. దాంతో సుమ మరోసారి సినిమాలు చేసే ఆలోచన వదిలేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం యాంకర్‌గానే కొనసాగుతున్న సుమ ఓ సందర్భంలో తనకి ఉన్న ఓ వింత వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. ‘కీలాయిడ్ టెండెన్సీ’ అనే వ్యాధితో సుమ చాలా ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతూ వస్తుందట. ఇది ఒక చర్మ వ్యాధి కాగా, సుమ దీని వలన ఎన్నో ఇబ్బందులు పడిందట.
ఈ వ్యాధి ఉన్న వారి చర్మానికి గాయం తగిలినప్పుడు ఆ గాయం రోజు రోజుకు పెద్దదిగా మారి చుట్టుపక్కల అంతా వ్యాపించి మరింత పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉంటుందట. కీలాయిడ్స్ సమస్య ఉన్న వారిలో అసలు గాయం కంటే ఈ కీలాయిడ్స్ పెద్దగా అవుతాయి. ఇవి సాధారణంగా ఛాతీ, భుజాలు, చెవులు, చెంపలపై వచ్చే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి పెద్దగా హానికరం కావు కానీ చాలా చిరాకుని కలిగిస్తాయి. కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటి విషయాలు సరిగ్గా తెలియక తన చర్మానికి ఇలా డ్యామేజ్ జరిగిందని, తర్వాత అది తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా.. ఫలితం రాలేదని సుమ ఓ సందర్భంలో స్పష్టం చేసింది.