Abhishek- Aishwarya| అంబాని పెళ్లితో మ‌రోసారి వార్త‌ల‌లోకి అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్ విడాకులు..సోలోగా ఐష్ పోజులు

Abhishek- Aishwarya| ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె అయిన రాధికా మ‌ర్చంట్‌తో అం

  • By: sn    cinema    Jul 13, 2024 10:39 AM IST
Abhishek- Aishwarya| అంబాని పెళ్లితో మ‌రోసారి వార్త‌ల‌లోకి అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్ విడాకులు..సోలోగా ఐష్ పోజులు

Abhishek- Aishwarya| ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె అయిన రాధికా మ‌ర్చంట్‌తో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అంబానీ పెళ్లి వేడుక‌కి హాజ‌రైన అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యామిలీపై అంద‌రి దృష్టి ప‌డ‌డం విశేషం. అందుకు కార‌ణం రెడ్ కార్పెట్‌పై అభిషేక్ బచ్చ‌న్, ఐశ్వ‌ర్య‌రాయ్ ఒక్క‌సారిగా కాకుండా విడి విడిగా రావ‌డం. గ‌త కొద్ది రోజులుగా అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌ల విడాకుల‌కి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, ఇప్పుడు ఈ వీడియోలు అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు అయ్యాయి.

అంబాని పెళ్లికి వ‌చ్చిన అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌యా బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్, శ్వేతా బ‌చ్చ‌న్ నందా, ఆమె భ‌ర్త నిఖిలా నందాల‌తో పాటు న‌వ్య న‌వేలి నంద‌, అగ‌స్త్య నంద క‌లిసి ఫొటోల‌కి పోజులిచ్చారు.వీరితో ఐశ్వ‌ర్య‌ర్యాయ్ ఆమె కుమార్తె ఆద్య క‌లిసి రాకుండా స‌ప‌రేట్‌గా రావ‌డం, సోలోగా ఐష్ ఫొటోల‌కి పోజులివ్వ‌డం ఇప్పుడు అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తుంది. ఏంటి అభిషేక్, ఐశ్వ‌ర్య బ‌చ్చ‌న్‌లు నిజంగానే విడాకులు తీసుకున్నారా.. ఆ విష‌యం బ‌య‌ట‌కి రాకుండా మెయింటైన్ చేస్తున్నారా అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైన అంబాని పెళ్లిలో అటు అభిషేక్ బ‌చ్చ‌న్, ఇటు ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌లు విడివిడిగా సంద‌డి చేయ‌డం మాత్రం ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకుల గురించి గత సంవత్సరం నుంచి ప్రచారం జరుగుతుంది. కొన్ని సంద‌ర్భాల‌లో అభిషేక్ మాత్ర‌మే ఈ రూమ‌ర్స్‌కి క్లారిటీ ఇచ్చాడు త‌ప్ప ఏ రోజు ఐష్ స్పందించింది లేదు. అందాల భామ ఐశ్వర్యరాయ్… బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి పెళ్లి జరిగిన ఎన్నో ఏళ్లు అయింది. ఇక వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. ఆ చిన్నారి ఫొటోలు కూడా ఇటీవ‌ల తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త్వ‌ర‌లో ఆరాధ్య‌ని ఇండ‌స్ట్రీకి ఐష్ ప‌రిచ‌యం చేయ‌నుంద‌నే టాక్ కూడా వినిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)