Jani Master| 36 రోజుల త‌ర్వాత జైలు నుండి బ‌య‌ట‌కు వచ్చిన జానీ మాస్ట‌ర్.. త‌ర్వాత ఏంటి..!

Jani Master| ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేయ‌డం మనం చూశాం. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉం

  • By: sn    cinema    Oct 25, 2024 5:51 PM IST
Jani Master| 36 రోజుల త‌ర్వాత జైలు నుండి బ‌య‌ట‌కు వచ్చిన జానీ మాస్ట‌ర్.. త‌ర్వాత ఏంటి..!

Jani Master| ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌(Jani Master)ను నార్సింగి పోలీసులు అరెస్టు చేయ‌డం మనం చూశాం. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉంటున్నారు. జానీ మాస్టర్ కు ఈ కేస్ కారణంగా వచ్చిన నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. మొదట అవార్డు వచ్చిన కారణంగా రంగారెడ్డి కోర్టు సైతం మధ్యంతర బెయిలు జానీ మాస్టర్ కు మంజూరు చేసిన‌, లైంగిక ఆరోపణలకి సంబంధించిన కేసు కావడంతో అవార్డును రద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. దీంతో జానీ మాస్టర్ కు మంజూరు అయిన మధ్యంతర బెయిల్(Bail) ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు

దీంతో జానీ మాస్టర్ రంగారెడ్డి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు . సుదీర్ఘ వాదన తర్వాత జానీ మాస్టర్(Jani) వేసిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ జానీ మాస్టర్ హైకోర్టును ఆశ్రయించాడు. జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు కావడంతో శుక్రవారం విడుదల చేశారు. లేడి డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 20న అరెస్ట్ అయ్యాడు జానీ మాస్ట‌ర్. గ‌త 36 రోజులుగా జైలు జీవితం గ‌డిపిన జానీకి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో నేడు విడుద‌ల అయ్యారు. 36 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్.. ఇప్పుడు బెయిల్‌పై బయటకు రావడంతో.. ఆయన నెక్ట్స్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇందులో పొలిటికల్ అంశాలు కూడా తెరపైకి రావడంతో జానీ నెక్ట్స్ స్టెప్ ఏంట‌ని అంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే 2017లో టీవీ షోలో పాల్గోన్న ఒక మ‌హిళ కొరియోగ్రాఫర్‌(Choreographer)తో జానీ మాస్ట‌ర్‌కు ప‌రిచ‌యం ఏర్పడ‌గా, ఆ స‌మ‌యంలోనే జానీ త‌న టీంలో త‌న‌ని తీసుకున్నాడ‌ని చెప్పింది. తాను మైన‌ర్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఒక హోట‌ల్‌లో జానీ త‌న‌పై హత్యాచారానికి పాల్పడ్డాడు అని యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును స్వీక‌రించిన నార్సింగి పోలీసులు జానీ మాస్ట‌ర్‌పై ఐపీసీ 376, 506, 323 సెక్ష‌న్‌ల‌తో పాటు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.