Bhagyashri Borse | భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదుగా..! మరో సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందిగా..!

Bhagyashri Borse | మాస్‌ మహరాజ్‌ రవితేజ, హరీశ్ శంకర్‌ కాంబోలో వచ్చిన మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఇంతకు ముందు బాలీవుడ్‌లో యారియాన్‌ 2, చందు ఈజ్‌ ద చాంపియన్‌ సినిమాల్లో నటించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నది.

Bhagyashri Borse | భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదుగా..! మరో సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందిగా..!

Bhagyashri Borse | మాస్‌ మహరాజ్‌ రవితేజ, హరీశ్ శంకర్‌ కాంబోలో వచ్చిన మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఇంతకు ముందు బాలీవుడ్‌లో యారియాన్‌ 2, చందు ఈజ్‌ ద చాంపియన్‌ సినిమాల్లో నటించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నది. తొలి సినిమానే బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. అయినా, భాగ్యశ్రీకి మాత్రం మంచి క్రేజ్‌ను తీసుకువచ్చింది. తొలి మూవీతోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఎదిగింది. తొలి సినిమాతోనే అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. తొలి సినిమా విడుదలకు ముందు విజయ్‌ దేరకొండ మూవీలో ఛాన్స్‌ అందుకుంది. ఇప్పటికే పలువు రు మేకర్స్‌ భాగ్యశ్రీ డేట్స్‌ క్యూ కడుతున్నారు.

మిస్టర్‌ బచ్చన్‌ మూవీ సెట్స్‌పై ఉండగానే భాగ్యశ్రీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. గౌతమ్‌ తిన్ననూని దర్శకత్వంలో ‘వీడీ12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. ఈ మూవీ ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్‌ జరుపుకుంటున్నది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అవకాశాన్ని దక్కించుకుంది భాగ్య శ్రీ. రానా దగ్గుబాటి నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా కాంత మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేశారని టాక్‌. వరుస మూవీలతో భాగ్యశ్రీ ఫుల్‌ ఫుల్‌ బిజీ అయినట్టేనని టాక్‌. భాగ్యశ్రీ, దుల్కర్‌ మూవీ ‘కాంత’ మూవీతో సత్తా చాటేందుకు సిద్ధమైంది. త్వరలోనే మూవీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉన్నది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు సైతం భాగ్యశ్రీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.