Bharateeyudu 2 | భారతీయుడు సినిమా తర్వాత అవినీతి తగ్గిందా..? కమల్ హసన్ స్పందన ఇదే..!
Bharateeyudu 2 | విశ్వనటుడు కమల్ హసన్ నటిస్తున్న చిత్రం భారతీయుడు-2. శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీపై భారీ అంచనాలున్నాయి. 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు - 2 వస్తున్నది. మూవీ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.

Bharateeyudu 2 | విశ్వనటుడు కమల్ హసన్ నటిస్తున్న చిత్రం భారతీయుడు-2. శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీపై భారీ అంచనాలున్నాయి. 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు – 2 వస్తున్నది. మూవీ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. ఈ క్రమంలో కమల్ హసన్, దర్శకుడు శంకర్, నటుడు సిద్ధార్థ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి హీరో కమల్ హసన్‌ను భారతీయుడు మూవీ తర్వాత దేశంలో ఏమైనా అవినీతి తగ్గిందా? అంటూ ప్రశ్నించారు. అవినీతి తగ్గి ఉంటే.. ఇప్పుడు భారతీయుడు 2 సినిమా తీయాల్సిన అవసరం ఉండేది కాదేమో ? అంటూ కామెంట్ చేశారు.
దీనికి కమల్ హసన్ స్పందిస్తూ ప్రశ్న, జవాబు కూడా మీరే చెప్పేశారంటూ చమత్కరించారు. అవినీతి అనేది తగ్గి ఉంటే భారతీయుడు 2 సినిమా తీసే అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు. అవినీతి అనేది అంతర్జాతీయస్థాయిలో సమస్యగా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే భారతీయుడు – 2 తెరకెక్కించినట్లు తెలిపారు. రాజకీయ నేతలను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం, అవినీతిని ఆహ్వానించడం.. అన్నీ మనమే కదా? చేస్తుంటాం అని అన్నారు. అవినీతి అంటే.. అదేదో ఉన్నపళాన మన ఎదుట సంభవించే పరిణామం కాదని.. దానికి మనమే బాధ్యులం అన్నారు. భారతీయుడు – 2 తెరకెక్కించడానికి అంతర్జాతీయ స్థాయిలో అవినీతి రాజకీయాలే స్ఫూర్తి అన్న ఆయన.. అందుకే ఆ రాజకీయాలకు కృతజ్ఞతలు చెబుతానని చెప్పారు.
సీఎం షరతుపై హీరో సిద్ధార్థ్ స్పందన..
తెలుగు ఇండస్ట్రీకి సీఎం రేవంత్‌రెడ్డి పెట్టిన షరతుపై హీరో సిద్ధార్థ్ స్పందించారు. ఈ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ తాను 20ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసునన్నారు. తనంతట తాను సామాజిక బాధ్యతగా తీసుకొని 2005 నుంచి 2011 వరకు కండోమ్స్‌పై ప్రచారం చేశానని.. తద్వారా సమైక్య ఏపీలో ప్రభుత్వానికి సహకరించానని చెప్పారు. ఇది తన బాధ్యతగానే భావించానని.. అయితే, ప్రతి నటుడికి బాధ్యత ఉందా? అనే ప్రశ్నకు తాను మాత్రం సమాధానం చెప్పలేనన్నారు. ప్రతి నటుడు బాధ్యతగా ఉండాలని.. తమ అంతట మేమే బాధ్యతగా తీసుకొని చేస్తామన్నారు. ప్రస్తుతం సీఎం ఏదైనా చేయాలని చెబితే చేస్తామన్నారు. అయితే, మీరు ఇలా చేస్తేనే.. అది చేస్తామని ఏ సీఎం కూడా షరతు పెట్టలేదన్నారు.