Bigg Boss8| మ‌తం గురించి బిగ్ బాస్ హౌజ్‌లో డిస్క‌ష‌న్.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్స్

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss) సీజ‌న్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ త‌ర్వాత షో మరింత రంజుగా మారింది. ఇక ఈ వారం రెండు రోజుల పాటు హోరా హోరీగా నామినేష‌న్స్ జ‌రిగాయి. ఈ క్ర‌మంలో వాగ్వాదాలు, ఏడుపులు, అరుపులు వంటివి అన్ని జ‌రిగాయి.ఈ వారం నామినేష‌న్(Nomination) ప్ర‌కారం కౌ గర్ల్స్ స్టైల్‌లో గుర్రం సౌండ్ వచ్చినప్పుడు కిల్లర్ గర్ల్స్‌గా ఉన్న ప్రేరణ, హరితే

  • By: sn    cinema    Oct 16, 2024 7:18 AM IST
Bigg Boss8| మ‌తం గురించి బిగ్ బాస్ హౌజ్‌లో డిస్క‌ష‌న్.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్స్

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss) సీజ‌న్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ త‌ర్వాత షో మరింత రంజుగా మారింది. ఇక ఈ వారం రెండు రోజుల పాటు హోరా హోరీగా నామినేష‌న్స్ జ‌రిగాయి. ఈ క్ర‌మంలో వాగ్వాదాలు, ఏడుపులు, అరుపులు వంటివి అన్ని జ‌రిగాయి.ఈ వారం నామినేష‌న్(Nomination) ప్ర‌కారం కౌ గర్ల్స్ స్టైల్‌లో గుర్రం సౌండ్ వచ్చినప్పుడు కిల్లర్ గర్ల్స్‌గా ఉన్న ప్రేరణ, హరితేజలో హ్యాట్ తీసుకున్న వారు ఎవరిని నామినేట్ చేయాలనే పవర్ దక్కుతుంది. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి వారు ఎవ‌రిని నామినేట్ చేయాల‌ని అనుకుంటున్నారో వారి పేరు, అందుకు సంబంధించిన పాయింట్స్ చెబుతారు. ఎవ‌రి పాయింట్ క‌రెక్ట్ అనిపిస్తుందో వారు చెప్పిన కంటెస్టెంట్ నామినేట్ అవుతారు.

నామినేష‌న్ ర‌చ్చ‌..

ఇక కిల్లర్ గర్ల్స్‌లో తక్కవసార్లు హ్యాట్ తీసుకున్న వాళ్లు కూడా నామినేషన్స్‌లో ఉంటారంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఎక్కువ సార్లు హరితేజనే హ్యాట్ అందుకుంది. దాంతో తన రాయల్ క్లాన్ సభ్యులు ఎక్కువ నామినేషన్స్‌లో పడకుండా ఓజీ గ్యాంగ్‌నే నామినేట్ చేసింది హరితేజ( Hari Teja). ఏడో వారం నామినేషన్స్‌లో ముందుగా 9 మంది నామినేట్ కాగా, అందులో గౌతమ్ కృష్ణ, నిఖిల్, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, నబీల్, యష్మీ గౌడ, టేస్టీ తేజ, అవినాష్‌(Avinash)తోపాటు ప్రేరణ ఉన్నారు. తాను నామినేషన్స్‌లో ఉన్నందున ఇమ్యూనిటి షీల్డ్ వాడుకుంటున్నట్లు అవినాష్ చెప్పాడు.అంతేకాదు త‌న‌కి బ‌దులు మ‌రొక‌రిని నామినేట్ చేయ‌మ‌న‌గా, హరితేజ‌ని నామినేట్ చేస్తున్న‌ట్టు చెప్పాడు.

మ‌రోవైపు విష్ణుప్రియ(Vishnu Priya)ను తప్పా ఓజీలో అందరిని నామినేషన్స్‌లో పెట్టింది హరితేజ. మొత్తానికి ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, నిఖిల్, మణికంఠ, పృథ్వీ, నబీల్, యష్మీ, టేస్టీ తేజ, ప్రేరణ, హరితేజ తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో ఎవ‌రు బ‌య‌ట‌కి వెళ‌తారో అనేది ఆసక్తిక‌రంగా మారింది. మ‌రోవైపు హౌజ్‌లో ఎప్పుడు జ‌ర‌గ‌ని విధంగా ప్పుడూ జరగని బ్లండర్‌ జరిగింది. కమ్యూనిటీ(మతం) ఓట్ల గురించి ఇద్ద‌రు కంటెస్టెంట్స్ చ‌ర్చించుకోవ‌డం పెద్ద హాట్ టాపిక్ అయింది. నబీల్‌, మెహబూబ్ త‌మ మ‌తం(Cast) ఓట్లు త‌మ‌కి ప‌డ‌తాయంటూ చ‌ర్చించుకోవ‌డాన్ని చాలా మంది నెటిజ‌న్స్ ట్రోల్‌ చేస్తున్నారు. కులాలు, మతాలు, సంఘాలు, ప్రాంతాలకు అతీతంగా షో రన్‌ అవుతుండ‌గా, ఇలా ఎందుకు చ‌ర్చిస్తున్నారు, డిస్‌క్లెయిమ‌ర్ లో కూడా కులం, మతం, ప్రాంతానికి అతీతంగా షో ర‌న్ అవుతుంద‌ని పేర్కొనండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.