Mahavatar Narasimha | మహావతార్ నరసింహ కు చాగంటి ప్రశంసలు

చాగంటి కోటేశ్వరరావు ప్రశంసలందుకున్న మహావతార్ నరసింహ సినిమా రూ.225 కోట్ల వసూళ్లతో 300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.

Mahavatar Narasimha | మహావతార్ నరసింహ కు చాగంటి ప్రశంసలు

 Mahavatar Narasimha | విధాత : రికార్డుల కలెక్షన్స్ కొల్లగొడుతున్న యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ చిత్రానికి ప్రముఖ ప్రవచన కర్త, ఏపీ ప్రభుత్వ నైతికత, విలువల సలహాదారు చాగంటి కోటేశ్వర్ రావు ప్రశంసలు అందించారు. శుక్రవారం నిర్మాత అల్లు అరవింద్, కె.ఐ. వర ప్రసాద్ రెడ్డితో కలిసి చాగంటి కోటేశ్వరరావు మహావతార్ నరసింహ సినిమాను థియేటర్ లో చూశారు. అనంతరం చాగంటి ఈ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. చిత్ర బృందం భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి.. హిరణ్యాక్షుడి పురాణ కథను యానిమేటెడ్ సినిమాగా తీసినప్పటికి సహజంగా..కనువిందుగా..నిజంగా దైవిక అనుభవాన్ని అందించేలా రూపొందించారని ప్రశంసించారు.

ఎక్కడా కూడా వాస్తవిక పురాణ కథకు అతిగా దూరం జరగకుండా నటీనటులు లేకుండా..బొమ్మలతోనే సజీవంగా తీయడం అభినందనీయమని..క్లైమాక్స్ అధ్బుతంగా ఉందని…నరసింహస్వామి దర్శనమైన అనూభూతికి అందించిందన్నారు. అన్ని వయసుల ప్రేక్షకులు కూడా దీనిని చూడవచ్చన్నారు. మహావతార్ నరసింహ ఇప్పటికే రూ.225కోట్లకు పైగా వసూళ్లను సాధించి రూ.300కోట్ల దిశగా సాగిపోతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి…

తెలుగులో ఈవారం ఓటీటీ కంటెంట్ మేళా – మయసభ నుంచి అరేబియా కడలి వరకు

చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే: వైఎస్ షర్మిలా రెడ్డి