Chiranjeevi| లండన్‌లో క్లింకారతో సరదాగా గడుపుతున్న చిరంజీవి,రామ్ చరణ్
Chiranjeevi| గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి, రామ్ చరణ్ సరదాగా ఫారెన్ ట్రిప్ వేశారు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు లం

Chiranjeevi| గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి, రామ్ చరణ్ సరదాగా ఫారెన్ ట్రిప్ వేశారు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు లండన్‌లో ఉన్నారు. ఇక అటు నుండి శుక్రవారం (జులై 26) జరగబోయే ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వెళ్లనున్నారు. అయితే సరదాగా లండన్ పార్క్‌లో గడుపుతున్న ఫొటోని చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లండన్ లోని హైడ్ పార్క్ లో ఫ్యామిలీతోపాటు మా చిన్నారి క్లిన్‌కారాతో ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం. రేపు పారిస్ వెళ్లబోతున్నాం. సమ్మర్ ఒలింపిక్స్ ఇనాగరల్ ఈవెంట్ రమ్మంటుంది అని చిరంజీవి తమ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేములో కనిపిస్తే మెగా ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. తాజా పిక్‌లో చిరంజీవి, రామ్ చరణ్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఇక వారితో పాటు సురేఖ, ఉపాసన, క్లింకార కూడా ఉన్నారు. క్లింకార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొద్దిరోజులుగా క్లింకార ఫేస్ రివీల్ చేయాలని మెగా ఫ్యామిలీని అభిమానులు కోరుతున్నా కూడా వారు మాత్రం రివీల్ చేసింది లేదు. తాజా పిక్ లో కూడా క్లింకార పూర్తి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతానికి అయితే మెగా ఫ్యామిలీ పిక్ మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి వచ్చే నెల 22న తన పుట్టిన రోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతని కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఇంద్ర మూవీ రిలీజ్ కానుంది. 22 ఏళ్ల కిందట అంటే 2002లో వచ్చిన ఇంద్ర మూవీలో ఇంద్రసేనా రెడ్డి పాత్రలో చిరంజీవి నట విశ్వరూపం చూపించగా, ఇప్పుడు మరోసారి ఆ చిత్రంతో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది ..ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ16లోనూ అతడు నటిస్తున్నాడు.
Klin kaara| క్లింకార వచ్చిన వేళా విశేషం.. మెగా ఫ్యామిలీ ఇంట అన్నీ శుభాలే..!
Klin Kaara| క్లింకార ఫస్ట్ బర్త్ డే..ఈ రోజు అయిన ఫేస్ రివీల్ చేస్తారా..!
Klin Kaara| క్లింకార బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ ఔట్.. ఎవరెవరు వచ్చారంటే..!