Sitara| సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలలోకి రాకపోయిన కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. చూస్తుంటే తండ్రిని మించిన తనయ అనే పేరు తెచ్చుకుంటుందని ఘట్టమనేని అభిమానులు భావిస్తున్నారు. బాల్యం నుండే నటిగా రాణించడాని
Sitara| సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలలోకి రాకపోయిన కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. చూస్తుంటే తండ్రిని మించిన తనయ అనే పేరు తెచ్చుకుంటుందని ఘట్టమనేని అభిమానులు భావిస్తున్నారు. బాల్యం నుండే నటిగా రాణించడానికి కావాల్సిన పునాదులు వేసుకుంటుంది సితార. నటనలో,డాన్సులలో శిక్షణ తీసుకుంటుంది. మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఆ మధ్య సితార ఓ అంతర్జాతీయ జ్యువెలరీ బ్రాండ్ కి ప్రచారకర్తగా వ్యవహరించడం మనకు తెలిసిందే.
న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార నటించిన జ్యువెలరీ యాడ్ వీడియో కూడా ప్రదర్శించారు. ఆ ఘనత సాధించడంతో ఆమె తల్లిదండ్రులు మహేష్, నమ్రత తెగ మురిసిపోయారు. ఈ యాడ్ కోసం నమ్రత ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకుందని, దానిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వాడిందని ప్రచారం జరిగింది. ఇక సితార సినిమాలలోకి వస్తుందంటూ కొన్నాళ్లుగా జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో సితార తనకు నటిగా ఎదగాలని ఉందా, లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ కావాలని అనుకుంటున్నారా? అని అడగ్గా, అందుకు తాను చిన్నప్పటి నుండి నాన్నని చూస్తూ పెరిగాను. ఆ క్రమంలో నాకు నటనపై, సినిమాలపై ఆసక్తి పెరిగిందని తెలిపింది.
భవిష్యత్ లో నేను తప్పక నటిస్తాను. కాకపోతే ఇంగ్లీష్ చిత్రాల్లో మాత్రమే నటించాలి అనుకుంటున్నాను అని సితార చెప్పుకొచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్ కాదని ఏకంగా హాలీవుడ్ మీద సితార కన్నేసిందని ఆమె మాటలతో అర్థం అవుతుంది. సితార ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడడం, ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువగా వీక్షించడంతో ఆమె హాలీవుడ్ సినిమాలలో నటించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సితార వయసు 12 ఏళ్ళు కాగా… 7వ తరగతి చదువుతుంది. రానున్న రోజులలో ఆమె సినిమాలలోకి వచ్చి సందడి చేయడం ఖాయమని తెలిసిపోయింది. అయితే సితార వయస్సు చిన్నదైన ఆమె ప్రవర్తన, మాట తీరు మాత్రం పెద్ద వాళ్లని తలపిస్తుంది.