నన్ను వాడుకొని వదిలేశాడు.. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై ప్రేయసి ఫిర్యాదు

ప్రేమించి పెళ్లి చేసుకుని తనను వదిలేసి మోసం చేశాడంటూ సినీ నటుడు రాజ్ తరుణ్‌పై ప్రేయసి లావణ్య శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • By: Somu    cinema    Jul 05, 2024 12:43 PM IST
నన్ను వాడుకొని వదిలేశాడు.. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై ప్రేయసి ఫిర్యాదు

విధాత, హైదరాబాద్ : ప్రేమించి పెళ్లి చేసుకుని తనను వదిలేసి మోసం చేశాడంటూ సినీ నటుడు రాజ్ తరుణ్‌పై ప్రేయసి లావణ్య శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి.. శరీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లిఖితపూర్వకంగా లావణ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కోంది. 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం తన సినిమాలో(తిరుగబడ్డరా సామీ) నటిస్తున్న హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రతో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని ఆరోపించింది.

రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడని, రాజ్‌ను వదిలేయకపోతే మాల్వీ మల్హోత్ర, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రలు నన్ను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కోంది. గతంలో నన్ను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నప్పటికి రాజ్‌ నాకు ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలని తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను అభ్యర్థించింది.