Hero Raj Tarun | విచారణకు హీరో రాజ్‌తరుణ్ గైర్హాజర్.. న్యాయవాది ద్వారా వివరణ
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య ప్రేమ వ్యవహారం కేసులో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నార్సింగ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సిన హీరో రాజ్‌తరుణ్ విచారణకు గైర్హాజరయ్యారు
విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య ప్రేమ వ్యవహారం కేసులో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నార్సింగ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సిన హీరో రాజ్‌తరుణ్ విచారణకు గైర్హాజరయ్యారు. తన న్యాయవాది ద్వారా రాజ్‌తరుణ్ పోలీసులు తనను నోటీస్‌లలో అడిగిన ప్రశ్నలకు వివరణలను పంపించారు. తాను అందుబాటులో లేకపోవడం కారణంగా.. విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ పోలీసులకు వివరణ ఇచ్చాడు.
అయితే లావణ్య ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో లావణ్య ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి, సోదరుడు మయాంక్ లపై నార్సింగి పోలీసులు సెక్షన్ 420, 493, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram