Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో మరో ఇద్దరిపై కేసు నమోదు
రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. లావణ్య తనకు రాజ్‌తరుణ్‌తో ఉన్న సంబంధంపై బుధవారం పూర్తి ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో రాజ్‌తరుణ్‌పై కేసు నమోద చేసిన పోలీసులు గురువారం మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు

లావణ్య ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు
విధాత, హైదరాబాద్ : రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. లావణ్య తనకు రాజ్‌తరుణ్‌తో ఉన్న సంబంధంపై బుధవారం పూర్తి ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో రాజ్‌తరుణ్‌పై కేసు నమోద చేసిన పోలీసులు గురువారం మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఏ1 గా రాజ్ తరుణ్‌ను, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ 3గా మయాంక్ మల్హోత్రాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాజ్‌తరుణ్‌తో తన ప్రేమ, పెళ్లికి సంబంధించి లావణ్య పోలీసులకు ఆధారాలు సమర్పించింది. 2008లో రాజ్‌తరుణ్‌తో ఏర్పడిన పరిచయం.. 2010 లో ప్రేమగా మారగా, 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు లావణ్య పేర్కోంది.
ఆ సమయంలో తమ కుటుంబం రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలు ఇచ్చామని.. 2016లో తాను గర్భవతిని అయ్యానని, రెండో నెలలో తనకు అబార్జన్ చేయించి.. హస్పిటల్స్ బిల్లులు కూడా రాజ్ తరుణే కట్టాడని తన ఫిర్యాదులో ఆధారాలతో తెలిపింది. అలాగే కావాలనే తనను డ్రగ్స్ కేసులో మాల్వీ, రాజ్ తరుణ్ ఇరికించారని, తనను మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను లావణ్య కోరింది. అలాగే మాల్వీ, ఆమె సోదరుడు తనని చంపుతామని బెదిరించారని, ముగ్గురిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.