Srileelaa । శ్రీలీల.. మజాకా! ఫుల్ జోష్‌లో డ్యాన్సింగ్ క్వీన్! ప్రతి నెలా ఓసినిమా రిలీజ్
గత సంవత్సరం నెలకో సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ పోయి తెగ సందడి చేసిన శ్రీలీల ఈ ఏడాది గుంటూరు కారం ఒక్క సినిమాలో మాత్రమే నటించగా, పుష్ఫలో కేవలం ఓ పాటలో మాత్రమే కనిపించి తన అభిమానులను నిరాశపర్చింది. అయితే కిస్సిక్ సాంగ్ తెచ్చిన కిక్‌తో శ్రీలీల మరోసారి గేరు మార్చింది. వరుసగా ఆరు సినిమాలను లైన్‌లో పెట్టి నాకు తిరుగులేదని చాటింది.

Srileelaa । గత సంవత్సరం నెలకో సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ పోయి తెగ సందడి చేసిన శ్రీలీల ఈ ఏడాది గుంటూరు కారం ఒక్క సినిమాలో మాత్రమే నటించగా, పుష్ఫలో కేవలం ఓ పాటలో మాత్రమే కనిపించి తన అభిమానులను నిరాశపర్చింది. అయితే కిస్సిక్ సాంగ్ తెచ్చిన కిక్‌తో శ్రీలీల మరోసారి గేరు మార్చింది. వరుసగా ఆరు సినిమాలను లైన్‌లో పెట్టి నాకు తిరుగులేదని చాటింది. ఇప్పటికే శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డతో, నాగ చైతన్య, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ కాంబో సినిమాలకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా నాగార్జున అన్నపూర్ణ, సితార సంస్థలు మొట్ట మొదటి సారి సంయుక్తంగా కలిసి అఖిల్‌తో నిర్మించనున్న సినిమాలోనూ కథానాయికగా శ్రీలీలను తీసుకున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో అన్నదమ్ముల సినిమాల్లో ఒకేసారి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండడమే కాక సితార సంస్థలో (మాస్ జాతర, సిద్ధు, అఖిల్) మూడు సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ సినిమాలన్నీ 2025లో ఒకదాని తర్వాత మరోటి రిలీజ్ కానుండగా ప్రతి నెలా ఓ చిత్రంతో శ్రీలీల సందడి చేయనుంది. దీంతో ఇప్పట్లో శ్రీలీలను టచ్ చేసే వాళ్లు, దరిదాపుల్లోకి కూడా వచ్చేవాళ్లు లేరంటూ ఫ్యాన్స్ గర్వంగా కాలరెగరేస్తున్నారు