Srileela l ఫేవరెట్ హీరో ఎవ‌రంటే.. శ్రీలీల మాములుది కాదండోయ్!

Srileela విధాత‌: శ్రీలీల.. ఈ అందాల ముద్దుగుమ్మ ‘పెళ్లిసందడి’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. మొదటి చిత్రంలో హీరో కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె ఎనర్జీ, డ్యాన్స్, అందం వంటివి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆ తర్వాత సీనియర్ స్టార్ హీరో రవితేజతో కలిసి ‘ధమాకా’ చిత్రంలో న‌టించింది. ఈ చిత్రంలో రవితేజకు పోటీగా అంతే ఎనర్జీతో నటించి.. డాన్సులతో మెప్పించి.. థియేటర్లలో చూస్తున్నవారు ఊగిపోయేలా చేసింది. ఈమె స్టెప్పులకు థియేటర్లు మారు మోగిపోయాయి […]

Srileela l ఫేవరెట్ హీరో ఎవ‌రంటే.. శ్రీలీల మాములుది కాదండోయ్!

Srileela

విధాత‌: శ్రీలీల.. ఈ అందాల ముద్దుగుమ్మ ‘పెళ్లిసందడి’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. మొదటి చిత్రంలో హీరో కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె ఎనర్జీ, డ్యాన్స్, అందం వంటివి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆ తర్వాత సీనియర్ స్టార్ హీరో రవితేజతో కలిసి ‘ధమాకా’ చిత్రంలో న‌టించింది.

ఈ చిత్రంలో రవితేజకు పోటీగా అంతే ఎనర్జీతో నటించి.. డాన్సులతో మెప్పించి.. థియేటర్లలో చూస్తున్నవారు ఊగిపోయేలా చేసింది. ఈమె స్టెప్పులకు థియేటర్లు మారు మోగిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. శ్రీలీల వల్ల పూజా హెగ్డే, రష్మిక వంటి హీరోయిన్ల కెరీర్‌కు చెక్ ప‌డే ప‌రిస్థితి త‌లెత్తింది అనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

టాలీవుడ్‌లో ఇప్పుడు కుర్ర హీరోల నుండి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ శ్రీ‌లీల జపం చేస్తున్నారు. నితిన్, రామ్ వంటి హీరోలకు శ్రీలీల కావాలి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకూ శ్రీ లీలే కావాలి. అలా ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల అవకాశాలకు గండి కొట్టింది. అందం, అభినయంతో పాటు అద్భుతమైన డాన్స్ శ్రీ‌లీల సొంతం. ఆమె కోసమే థియేటర్స్‌కు క‌దిలే ప్రేక్ష‌కుల సంఖ్య ఇప్పుడు పెరిగిపోతోంది. అందుకే శ్రీ‌లీల కోసం టాలీవుడ్ మొత్తం ఆశ‌గా ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం ఆమె మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు నవీన్ పోలిశెట్టి, పంజా వైష్ణవ తేజ్, నితిన్, రామ్ వంటి హీరోలతో నటిస్తోంది. ఇంతమంది హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు సంపాదిస్తున్న శ్రీలీలకు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘టాలీవుడ్‌లో ఇష్టమైన హీరో ఎవరు?’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

‘‘తెలుగులో ఉన్న హీరోలందరూ నాకు ఇష్టమే. అందరూ ఎంతో అద్భుతంగా నటిస్తారు. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి మామూలు హీరోల కంటే డాన్స్ బాగా చేసే హీరోలను నేను ఇంకాస్త ఎక్కువగా ఇష్టపడతాను. ఆ విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోలు’’ అంటూ శ్రీ‌లీల చెప్ప‌క‌నే చెప్పుకొచ్చింది. ఈ సమాధానం విన్నవారంతా.. శ్రీలీల తెలివిగలదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.