Nagarjuna|సెలబ్రిటీలని వణికిస్తున్న హైడ్రా.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
Nagarjuna| అక్రమ నిర్మాణాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరఢా ఝుళిపిస్తుండడంతో సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా అక్కినేని నాగార్జునకి పెద్ద షాక్ ఇచ్చింది. . కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న

Nagarjuna| అక్రమ నిర్మాణాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరఢా ఝుళిపిస్తుండడంతో సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా అక్కినేని నాగార్జునకి పెద్ద షాక్ ఇచ్చింది. . కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధం కాగా, ఆయన దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు.ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు ఉండడంతో కూల్చివేత మొదలు పెట్టారు. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా ఈ రోజు ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా..చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. మాదాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. అయితే, నాగార్జునకు చెందిన నిర్మాణం కావటంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు అందరిలో మెదలగా, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టేది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ స్పష్టం చేసారు. ఈ క్రమంలోనే . తమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేస్తూ పక్కా అధారాలు సమర్పించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియోపై కూడా ఆంక్షలు విధించారు. కాగా, ఇదిలా ఉంటే , హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద ‘హైడ్రా’ స్పెషల్ ఫోకస్ పెట్టింది . కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ కి కూడా త్వరలో హైడ్రా చెక్ పెడుతుందని అంటున్నారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని ఆదేశించిన హై కోర్టు
మాదాపూర్ లోని తమ్మడి చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేతలు ఆపాలని హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాదాపూర్ లో నిర్మించిన తన ఎన్ కన్వెన్షన్ కూల్చి వేత ఆపాలని సినిమా హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై విచారించిన జడ్జి జస్టీస్ వినోద్ కుమార్ కూల్చివేతలు నిలిపి వేయాలని ఆదేశించారు. అయితే తీర్పు వచ్చే లోపే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు, సిబ్బంది పూర్తిగా నేలమట్టం చేయడం గమనార్హం.
ఇలాంటివాటితోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం: ఆకునూరి మురళి
సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పందించారు. సుపరిపాలన అంటే ఇదేనని, ఇటువంటివి చూస్తే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ఇది సుపరిపాలన అంటే. వినడానికి బాగుంది. ఇలాంటివి చూస్తే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పెద్దా/ చిన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా (అధికార పార్టీతో సహా) ఇల్లీగల్‌గ కట్టినవన్నీ అందరివీ కూల్చేయండి. పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా ప్రాసిక్యూట్ చెయ్యండి’ అని అందులో పేర్కొన్నారు.