CM Revanth | ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
CM Revanth | కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
CM Revanth | హైదరాబాద్ : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.
బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ లతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని గద్వాల్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
కర్నూల్ జిల్లా( Kurnool District )లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్( Hyderabad ) నుంచి బెంగళూరు( Bengaluru ) వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు( Kaveri Travels Bus )లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్దకు రాగానే అగ్నికీలలు ఎగిసిపడడంతో క్షణాల్లోనే బస్సు బుగ్గి పాలైంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు పైగా సజీవదహనం అయ్యారు. మరో 12 మంది కాలిన గాయాలతో బయటపడ్డారు. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram