Cinematography Metting : భట్టితో హీరో అక్కినేని, మంత్రులు అజారుద్ధీన్, అడ్లూరిల భేటీ !

భట్టితో హీరో నాగార్జున, మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి భేటీ. సినీ రంగం, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ. సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండా భేటీ చర్చనీయాంశం.

Cinematography Metting : భట్టితో హీరో అక్కినేని, మంత్రులు అజారుద్ధీన్, అడ్లూరిల భేటీ !

విధాత, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి మధ్య రాష్ట్ర అభివృద్ధి, సినీ రంగానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సినిమాటోగ్రఫీ లేకుండానే సినిమా రంగంపై భేటీలు…నిర్ణయాలు ?

సినిమాటోగ్రఫి శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆయన లేకుండానే చిత్ర పరిశ్రమపై భట్టితో మంత్రులు అజార్, అడ్లూరి, హీరో నాగార్జునలు ఏం చర్చించారన్నది ఆసక్తికరం. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికుల సదస్సులో మంత్రి వెంకట్ రెడ్డి లేకుండానే పాల్గొనడం గమనార్హం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డిని పూర్తిగా డమ్మీని చేసి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కోమటిరెడ్డి ప్రమేయం లేకుండానే టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో అనుమతులు వంటి వాటిపై నిర్ణయం తీసుకుంటున్నారని ఇప్పటికే ప్రచారం సాగింది. సినిమా పరిశ్రమ వ్యవహారాలను రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి చేతిలో పెట్టాడని, నా శాఖపై రేవంత్ గ్యాంగ్ పెత్తనం ఏంటని సన్నిహితుల వద్ద కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడన్న ప్రచారం సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో భట్టితో మంత్రులు అజార్, అడ్లూరి, హీరో నాగార్జునలు సినిమారంగంపై ఏం చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది.