మ‌ల్లీశ్వ‌రి చిత్రంలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంత బోల్డ్‌గా క‌నిపిస్తుందేంటి?

మ‌ల్లీశ్వ‌రి చిత్రంలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంత బోల్డ్‌గా క‌నిపిస్తుందేంటి?

విక్టరీ హీరో వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన మ‌ల్లీశ్వ‌రి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కే విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో క‌త్రినా కైఫ్ కథానాయిక‌గా న‌టించింది. సునీల్, బ్రహ్మానందం, నరేష్ వంటి స్టార్ క్యాస్ట్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు. ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. కామెడీ, ఎమోషన్, లవ్, రొమాన్స్ కలగలిపి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా ఈ ఈ చిత్రాన్ని రూపొందించారు. వెంకటేష్-విజయ భాస్కర్ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సూపర్ హిట్ కాగా, ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌ల్లీశ్వ‌రి కూడా బంప‌ర్ హిట్ కొట్టింది.

అయితే చిత్రంలో న‌రేష్‌.. వెంక‌టేష్ అన్న‌య్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశాడు. పెళ్లి కాని ప్ర‌సాద్‌గా వెంక‌టేష్ అల‌రించాడు. ఇక న‌రేష్ కూతురి పాత్ర‌లో గ్రీష్మ నేత్రిక క‌నిపించింది. వెంకటేశ్ ఆమె కాంబోలో మంచి సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో చాక్లెట్ తీసుకు రాగానే.. బార్ అంటే ఇంత బారుగా ఉండాలి అంటూ మన హీరోకు అదిరిపోయే పంచ్ ఇస్తుంది చిన్నారి గ్రీష్మ‌. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టిన చిన్నారి అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు వంటి చిత్రాల్లో కూడామెరిసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అద‌ర‌గొట్టిన ఈ చిన్నారి ఇప్పుడు యుక్త వ‌య‌స్సుకి రాగానే క‌థానాయిక‌గా న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుంది.

ఎన్టీఆర్ బయోపిక్.. మహా నాయకుడు చిత్రంలో నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం యంగ్ పాత్రలో కనిపించి అలరించింది గ్రీష్మ నేత్రిక. ఈ అమ్మ‌డు ఇప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నట్లు సమాచారం.అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సినిమాలు చేస్తుంది. అయితే గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉంద‌ని ప‌లువురు నెటిజ‌న్స్ సెర్చ్ చేస్తుండ‌గా,ఆమె బోల్డ్ ఫొటోలు కూడా ద‌ర్శ‌నం ఇస్తున్న‌యి. యంగ్ ఏజ్ లో ఉన్న గ్రీష్మ నేత్రిక ఇప్పుడు పెరిగి ఇంత పెద్ద‌గా అయిందా, చాలా హాట్‌గా కూడా త‌యారైంది అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గ్రీష్మ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మర్మ దేశం అనే చిత్రం ఉంది. ఒక్క మంచి హిట్ ప‌డితే టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవ‌కాశం ఉంది.