Dude Trailer : డ్యూడ్ మూవీ ట్రైలర్ విడుదల

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్‌’ మూవీ ట్రైలర్ విడుదలైంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 17న తెలుగు, తమిళంలో విడుదల కానుంది.

Dude Trailer : డ్యూడ్ మూవీ ట్రైలర్ విడుదల

విధాత : దర్శకుడిగా తొలి సినిమాతో హిట్ కొట్టిన తమిళ నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలతో కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నిర్మిస్తున్న ‘డ్యూడ్‌’ మూవీ నిర్మిస్తుంది. మూవీ నుంచి మేకర్స్ గురువారం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీతోనే కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండగా… ప్రేమలు ఫేం మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే రోహిణి మొల్లేటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా అక్టోబరు 17న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలైన ట్రైలర్‌ యూత్ ను ఆకట్టునే రీతిలో ఉంది.

ట్రైలర్ చూస్తే మూవీ కామెడీ, ఎమోషన్స్ తో కూడిన ఓ ఫుల్ లెంగ్త్ లవ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ‘లైఫ్‌లో ఒక విషయాన్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తే లైఫ్ నిన్ను లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తుంది.’ అన్న డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ లో ‘మన మధ్య ఈ లవ్ సెట్ కాదు’ అనే హీరోయిన్ డైలాగ్‌తో పాటు.. ‘ఏంట్రా నీ కథ, పిల్ల ఉంటే పెళ్లవ్వదు. పెళ్లి ఉంటే పిల్ల ఉండదు. ఏంట్రా ఇది?’ అంటూ హీరో ఫ్రెండ్ చెప్పడం..జరిగేది ఏదీ మన చేతిలో ఉండదంటూ హీరో చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచాయి.