Alekhya Chitti Pickles Ramya Moksha | ఆలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్ రమ్య బిగ్ బాస్ ఎంట్రీ !
'ఆలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌లో ఒకరైన రమ్య.. తన హాట్ డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆమెకు బిగ్ బాస్ షోలో అవకాశం రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

విధాత: ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ సిస్టర్స్ అంటే తెలుగు రాష్ట్రాలలో..ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ కు సుపరిచితమే. ఆ ముగ్గురు (చిట్టి, అలేఖ్య, రమ్య) అక్కా చెల్లెళ్లు ‘అలేఖ్య చిట్టి పికిల్స్’తో సాగించిన పచ్చళ్ల వ్యాపారం కంటే..అనూహ్యంగా కస్టమర్ల పట్ల వాడిన బూతు మాటలతో రేగిన వివాదంతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ‘మీ పచ్చళ్ల ధరలు మరీ అధికంగా ఉన్నాయండి’ అన్న ఒకే ఒక మాటకు ఓ కస్టమర్ ను అమ్మనా బూతులు తిట్టడంతో మొదలైన వివాదం కాస్తా.. అప్పటిదాక టాప్ గేర్ లో సాగిన వారి పచ్చళ్ల వ్యాపారాన్ని పాతాళానికి పడేసింది. ఆ తర్వాతా.. జరిగిన దానికి అలేఖ్య పికెల్స్ సిస్టర్స్ సారీ చెప్పినప్పటికి జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇదంతా పక్కన పెడితే తరుచు ఆలేఖ్య సిస్టర్స్ యూట్యూబ్ లో తమ పచ్చళ్లతో పాటు పలు రకాల వీడియోలతో నెటిజన్లను పలకరిస్తుంటారు. ముఖ్యంగా ముగ్గురు సిస్టర్స్ లో హీరోయిన్ పీస్ గా భావించే రమ్య సిస్టర్ తన హాట్ హాట్ డ్యాన్స్ లతో అడపదడపా సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఆలేఖ్య పికెల్స్ సిస్టర్ కు సోషల్ మీడియాలో ఉన్న వంద మిలియన్ల వ్యూవర్స్ ఫాలోయింగ్ కు వారికి బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ రావాలని నెటిజన్లు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. తాజాగా రమ్య డ్యాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెకు ఇటు బిగ్ బాస్ షోలో, అటు సినిమాల్లో మంచి అవకాశాలు రావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రమ్య బిగ్ బాస్ లోకి ఎంటరైతే అందరూ అవుట్ అంటూ రమ్యను పొగిడేస్తున్నారు.