Kannappa Movie | అంతా శివయ్య లీల : కన్నప్ప విజయంపై మంచు విష్ణు

Kannappa Movie | ‘కన్నప్ప’ సినిమా విజయంపై హీరో మంచు విష్ణు స్పందించారు. కుటుంబ సభ్యులతో కలిసి గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్ లో కన్నప్ప సినిమాను చూశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ అంతా శివలీలగా ఉందని..అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తోందని..ఇది కొనసాగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నానన్నారు. విజయోత్సాహంలో ఉన్న తనకు మాటలు రావడం లేదన్నారు. సినిమా వాళ్లకి కనిపించే దేవుళ్లు.. ప్రేక్షకులేనని అందరినీ వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని చెప్పారు.
ఈ విజయాన్ని ముందుగా తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకున్నానని పేర్కొన్నారు. మంచు విష్ణు కీలకపాత్రలో నటించిన కన్నప్ప సినిమా సినిమా శుక్రవారం విడుదలై అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుని గతంలో తెలుగులో హిట్ అయిన..భక్త కన్నప్ప సినిమా కథను ఎంచుకుని కన్నప్ప సినిమాను పదేళ్ల పాటు రూ.200కోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు తెరకెక్కించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, ప్రీతినందన్ లు నటించిన ఈ సినిమా విజయవంతం కావడంతో మంచు కుటుంబం సంబురాల్లో మునిగిపోయింది.