Prabhas Kannappa | “నా పెళ్లి గురించి ఎందుకులే…”.. ప్రభాస్ డైలాగ్‌కి థియేటర్లే ఊగిపోయాయి!

ప్రభాస్ పెళ్లిపై వచ్చిన గాసిప్స్ కూడా ఇదే నేపథ్యంలో మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎన్నోసార్లు అనుష్కతో పెళ్లి వార్తలు, ఏఐ ప్రభాస్‌ పెళ్లి ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి. ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి కొన్నేళ్ల క్రితం “ఈ ఏడాదిలోనే ప్రభాస్‌ పెళ్లి అవుతాడు” అని ప్రకటించిన మాటలు ఇప్పటికీ అభిమానుల్లో ఆశను నింపుతూనే ఉన్నాయి.

Prabhas Kannappa | “నా పెళ్లి గురించి ఎందుకులే…”.. ప్రభాస్ డైలాగ్‌కి థియేటర్లే ఊగిపోయాయి!

⦁ ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌ డైలాగ్​పై రియాక్షన్స్
⦁ రీల్‌– రియల్ లైఫ్‌ మిక్స్‌ గా ఫ్యాన్స్ విశ్లేషణ

Prabhas Kannappa | పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్‌, ఆ క్రేజ్‌ను ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో మరింత విస్తృతం చేశారు. మధ్యలో వచ్చిన ‘సాహో’, ‘ఆదిపురుష్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, ప్రభాస్‌ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్, తాజాగా విడుదలైన ‘కన్నప్ప’లో గెస్ట్ రోల్ చేయడం మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది.

ఈ సినిమాలో ప్రభాస్‌ నటించిన తీరు, ట్రైలర్‌లో కనిపించడమే కాదు, సినిమాకే ఓ పెద్ద హైప్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే, సినిమా కంటే ఎక్కువ చర్చకు వస్తోంది ఒక డైలాగ్. సినిమా మధ్యలో వచ్చే ఒక సన్నివేశంలో కన్నప్ప పాత్రలో ఉన్న విష్ణు, రుద్రుడి పాత్రలో ఉన్న ప్రభాస్‌ను “నీకు పెళ్లయిందా?” అని అడుగుతాడు. దానికి ప్రభాస్ “నా పెళ్లి గురించి ఎందుకులే…” అని సమాధానమిస్తాడు. ఆ డైలాగ్ వినగానే థియేటర్లు కేకలతో, ఈలలతో మారుమోగిపోయాయి. ఈ డైలాగ్‌పై అభిమానుల స్పందనతో సోషల్​మీడియా ఊగిపోతోంది. ప్రభాస్‌ జీవితంలోని వాస్తవికతను ప్రతిబింబించిందనే భావన అభిమానుల్లో మొదలైంది. 45 ఏళ్ల వయస్సు దాటినా, ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉన్న ప్రభాస్‌ విషయాన్ని గుర్తు చేస్తూ, “ఇది ఆయన నిజమైన ఫీలింగే కావచ్చు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే “ఇది డైలాగ్ కాదు.. మనసులో మాట!” అని పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఈ డైలాగ్‌కి రకరకాల మీమ్స్‌, వీడియో ఎడిట్స్, మాషప్‌లు వైరల్‌ అవుతున్నాయి.

ప్రభాస్ పెళ్లిపై వచ్చిన గాసిప్స్ కూడా ఇదే నేపథ్యంలో మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎన్నోసార్లు అనుష్కతో పెళ్లి వార్తలు, ఏఐ ప్రభాస్‌ పెళ్లి ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి. ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి కొన్నేళ్ల క్రితం “ఈ ఏడాదిలోనే ప్రభాస్‌ పెళ్లి అవుతాడు” అని ప్రకటించిన మాటలు ఇప్పటికీ అభిమానుల్లో ఆశను నింపుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ పెళ్లిపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. ఇప్పుడు మాత్రం ‘కన్నప్ప’ సినిమాలో వచ్చిన ఆ డైలాగ్‌తో పెళ్లి చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.


ఫ్యాన్స్‌ కోణంలో చూస్తే, ఇది కేవలం ఓ సినిమా డైలాగ్ కాదని, ఏకంగా ప్రభాస్ జీవితం మీద వ్యాఖ్యానంగా భావిస్తున్నారు. “ఆ మాట వినగానే ఆయన మనసులోని నిజం బయటపడినట్టుంది” అని పలువురు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నిజానికి చాలామంది అభిమానులకు, ప్రేక్షకులకు అనుష్కను ప్రభాస్​ సతీమణిగా చూడాలని కోరిక. కొన్ని దశాబ్దాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న ప్రభాస్‌ పెళ్లి వార్త – ఇప్పటికైనా అధికారికంగా ఏదైనా క్లారిటీ వస్తుందా? లేక ఇది కూడా ఫ్యాన్స్ ఊహగానాల దగ్గరే ఆగిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.