Pawan Kalyan: ప్రభాస్ అభిమానులకి చేతులెత్తి వేడుకుంటున్నా.. ఇంకోసారి అలా చేయకండి: పవన్
Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, జనేసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. జ్వరం వలన మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జూన్ 30న భీమవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట […]

Pawan Kalyan:
ప్రముఖ సినీ నటుడు, జనేసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. జ్వరం వలన మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జూన్ 30న భీమవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సభలో ఆయన ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను ఇప్పటి వరకు ఎలాంటి ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, జనసేన అనే పార్టీ పెట్టాను. నన్ను అభిమానించే వారు, అభిమానించని వారు కూడా నాకు కావాలి అని పవన్ చెప్పుకొచ్చారు.
భీమరంలో ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. అలానే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీ అందరికి మంచి చేయడానికే జనసేన ఉంది. మా వాళ్లు సైలెన్సర్స్ తీసేసి బండ్లపై తిరగడం గతంలో కన్నా తగ్గింది. వైసీపీ వాళ్లు తమ నోటి సైలెన్సర్స్ తీసేస్తే మా వాళ్లు కూడా పూర్తిగా తగ్గిస్తారు అని అన్నారు.
ఇక 2015లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య పోస్టర్ విషయంలో పెద్ద ఫైటింగ్ జరగగా, దీనిపై భీమవరం సభలో పవన్ స్పందించారు. చిన్న పోస్టర్ చింపితే ఆ విషయాన్ని పెద్దది చేసి గొడవ పడొద్దు. క్షమించి వదిలేయాలి. ఇలాంటి మరోసారి చేయకండి. మీ అందరికి చేతులెత్తి వేడుకుంటున్నా అని పవన్ అన్నారు.
నరసాపురం సభలో కూడా పవన్ కళ్యాణ్.. ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రభాస్ గారు ఒక బాహబలి .. ఆయన ఇటీవల ఆదిపురుష్ చేశాడు. సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆయన సినిమా వలన రోజుకు 500 నుంచి 1000 మంది వరకు.. ఒక్కోసారి 2000 మందికి కూడా ఉపాధి దొరుకుతుంది. ప్రభాస్ ఇన్‌కమ్ టాక్స్ కడుతారు.. అలానే జీఎస్టీ కడుతారు.
ఇక షూటింగులో అయితే ఆయన వందల మందికి అన్నం పెడుతారు. ఆయన సినిమా రిలీజ్ కావడం వలన థియేటర్స్ దగ్గర చిరు వ్యాపారులకి బిజినెస్ జరుగుతుంది. తోపుడు బండ్లు నడుపుకొనే వారికి ఆదాయం వస్తుంది. ఎంతో మందికి జీవితం, వ్యవస్థ నడుస్తుంది అని పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు సభలో తనకు మద్దతు తెలిపిన ప్రభాస్ అభిమానులకి కృతజ్ఞతలు కూడా తెలిజేశారు.