Filmfare Awards South 2024| 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విన్న‌ర్స్ వీరే.. ఉత్త‌మ చిత్రంగా బ‌ల‌గం, ఉత్త‌మ న‌టుడు నాని

Filmfare Awards South 2024| ప్ర‌తి ఏడాది కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సౌత్‌ సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి జ‌రిగే ఈ అవార్డ్ వేడుక‌కి ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు అంద‌రు హ‌జ‌రై సంద‌డి చేస్తుంటారు. తారల సంద‌డితో ఆ ప్రాంగ‌ణం అంతా కోలాహాలం

  • By: sn    cinema    Aug 04, 2024 7:04 AM IST
Filmfare Awards South 2024| 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విన్న‌ర్స్ వీరే.. ఉత్త‌మ చిత్రంగా బ‌ల‌గం, ఉత్త‌మ న‌టుడు నాని

Filmfare Awards South 2024| ప్ర‌తి ఏడాది కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సౌత్‌ సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి జ‌రిగే ఈ అవార్డ్ వేడుక‌కి ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు అంద‌రు హ‌జ‌రై సంద‌డి చేస్తుంటారు. తారల సంద‌డితో ఆ ప్రాంగ‌ణం అంతా కోలాహాలంగా ఉంటుంది. అయితే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ 2024 వేడుక తాజాగా అట్ట‌హాసంగా జ‌రిగింది.హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఈ వేడుక‌కి చాలా మంది సినీ సెల‌బ్రిటీలు హాజ‌రై సంద‌డి చేశారు.

శనివారం రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగిన వేడుక‌కి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన హీరో, హీరోయిన్స్ హాజ‌రై సంద‌డి చేశారు. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ హోస్ట్ లుగా వ్యవహరించిన ఈ వేడుక‌లో రాశీఖన్నా, అపర్ణ బాలకమురళీ, సానియా ఇయాపాన్‌, గాయత్రీ భరద్వాజ్‌ తదితరులు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అల‌రించారు. ఇక 2023కు గాను నామినేట్ అయ్యిన చిత్రాల్లో ఏయే చిత్రాలు, ఏయే న‌టులు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు గెలుగుచుకున్నారో చూద్దాం.

‘దసరా’లో నటనకు గానూ నాని , కీర్తి సురేష్ లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును ఇద్దరు అందుకున్నారు. శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న) ఇద్దరి సినిమాల్లోనూ నాని హీరోగా నటించడం మరో విశేషం.

69 శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 తెలుగు విజేతలు వీళ్లే..

ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్‌ (దసరా)
ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): సాయి రాజేష్‌ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌)
ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూరన్‌ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కొల్లా అవినాష్‌ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా)