Laayi Le Song : ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుంచి ‘లాయి లాయి లే’ సాంగ్ రిలీజ్

రష్మిక మందానా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా నుంచి ‘లాయి లాయి లే’ సాంగ్ విడుదలైంది. హేషమ్ అబ్దుల్ సంగీతం, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం.

Laayi Le Song : ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుంచి ‘లాయి లాయి లే’ సాంగ్ రిలీజ్

విధాత : రష్మిక మందానా, దీక్షిత్‌శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా నుంచి మేకర్స్ ‘లాయి లాయి లే’ సాంగ్ రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన మేకర్స్ గురువారం ‘లాయి లాయి లే’ సాంగ్ ను విడుదల చేసి ప్రమోషన్ లో జోరు పెపంచారు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్‌ కపిలన్‌ పాడారు. హేషమ్‌ అబ్దుల్‌ సంగీతం అందించారు.

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో హీరోయిన్ అనుఇమ్మాన్యూయెల్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే సినిమా కథ ట్రయంగల్ లవ్ స్టోరీగా కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.