Ravi Teja| అయ్య‌య్యో.. ర‌వితేజ మెడకి ఏమైంది.. ద‌గ్గ‌రుండి సేవ‌లు చేస్తున్న డైరెక్ట‌ర్

Ravi Teja| మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇప్పుడు టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. 56 ఏళ్ల వ‌య‌స్సులో కూడా ర‌వితేజ కుర్రాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. ర‌వితేజ డెడికేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ సమయంలో ఆయన గాయపడగా.. 10 కుట్లు పడితే.. వైద్యులు విశ్రాంతి తీసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చారు. అయితే త‌న వ‌ల‌న నిర్మాత‌లు న‌ష్ట‌పోకూడ‌ద‌ని

  • By: sn    cinema    Jun 15, 2024 7:55 AM IST
Ravi Teja| అయ్య‌య్యో.. ర‌వితేజ మెడకి ఏమైంది.. ద‌గ్గ‌రుండి సేవ‌లు చేస్తున్న డైరెక్ట‌ర్

Ravi Teja| మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇప్పుడు టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. 56 ఏళ్ల వ‌య‌స్సులో కూడా ర‌వితేజ కుర్రాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. ర‌వితేజ డెడికేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ సమయంలో ఆయన గాయపడగా.. 10 కుట్లు పడితే.. వైద్యులు విశ్రాంతి తీసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చారు. అయితే త‌న వ‌ల‌న నిర్మాత‌లు న‌ష్ట‌పోకూడ‌ద‌ని భావించి వెంట‌నే చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొని షూటింగ్ పూర్తి చేసాడు. ఇక ఇప్పుడు ర‌వితేజ చేస్తున్న మూవీ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్. ఈ మూవీ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న‌ ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రవితేజ షూటింగ్ లో పాల్గొంటుండ‌గా, ఆయ‌న‌కి సంబంధించి హరీష్ శంకర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

హ‌రీష్ శంక‌ర్ త‌న పోస్ట్‌లో రవితేజ మెడ నొప్పి తగ్గడానికి మెడ మీద బ్యాండ్ పెట్టుకొని కూర్చోగా హరీష్ శంకర్ పక్కనే అది పట్టుకొని కూర్చున్నాడు. ఈ ఫోటో షేర్ చేస్తూ.. రవితేజ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నా షూటింగ్ చేస్తున్నారు. థ్యాంక్యూ అన్నయ్య. ప్రతి రోజు మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తావు అని రాసుకొచ్చాడు. అయితే హ‌రీష్ శంక‌ర్ పోస్ట్‌తో ర‌వితేజ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. రవితేజ మెడకు ఏమైంది? రవితేజ మెడ నొప్పికి కారణమేంటి అంటూ హ‌రీష్ పోస్ట్‌కి కామెంట్స్ చేస్తున్నారు.

రవితేజ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ … సినిమా కోసం రవితేజ ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతుండ‌డం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఇక ర‌వితేజ న‌టిస్తున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా విష‌యానికి వ‌స్తే.. పనోరామ స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ట సహ నిర్మాత. ఈ సినిమా గ‌త కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయకి. సెప్టెంబర్‌లో మూవీ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు మేకర్స్. ఇక ర‌వితేజ ఇటీవ‌ల మ‌రో సినిమా కూడా ఓకే చేయ‌గా, ఈ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇందులో శ్రీలీల‌ని క‌థానాయిక‌గా తీసుకున్నారు.