Harish Shankar|గత కొద్ది రోజులుగా చోటా కే నాయుడు, హరీష్ శంకర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. చోట కె నాయుడు గత కొద్ది రోజుల క్రితం పలు ఇంట
Harish Shankar|గత కొద్ది రోజులుగా చోటా కే నాయుడు, హరీష్ శంకర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. చోట కె నాయుడు గత కొద్ది రోజుల క్రితం పలు ఇంటర్వ్యూలు ఇస్తూ, ఆ ఇంటర్వ్యూలలో హరీష్ శంకర్ గురించి ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘రామయ్య వస్తావయ్యా‘ సినిమా షూటింగ్ సమయంలో తన మాటలను హరీష్ శంకర్ పట్టించుకోలేదని, ఆసమయంలో తాను ఇచ్చిన సలహాలు సూచను కూడా తీసుకోలేదని అన్నారు. కొన్ని విషయాలలో నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కూడా ఆయన వినలేదని అన్నారు.
అయితే హరీష్ శంకర్ గురించి పలు సందర్భాలలో చోటా కే నాయుడు ప్రస్తావించడంతో తాజాగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. “మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీ మీద ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకోండి” అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. గౌరవనీయులైన చోట కె నాయుడుగారికి నమస్కరిస్తూ.. రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ, రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నాడని పదిమంది పది రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా.
ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే, ‘గబ్బర్‌సింగ్’ వచ్చినప్పుడు నాది ‘రామయ్య వస్తావయ్య’ వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా. కానీ. నా స్నేహితులు అవ్వచ్చు, లేదా నన్ను అభిమానించే వాళ్లు అవ్వచ్చు, నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే.. ఎనీ డే, ఎనీ ఫ్లాట్ ఫారమ్, ఐయామ్ వెయిటింగ్. భవదీయుడు హరీష్ శంకర్” అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు