Hema| హేమ మామూల్ది కాదు.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టేస్తుందిగా…!

Hema| న‌టి హేమ ఒక‌ప్పుడు ప్ర‌తి సినిమాలో స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో క‌నిపించేది.ముఖ్యంగా బ్ర‌హ్మనందం కాంబినేష‌న్‌లో ఆమె క‌నిపించి సంద‌డి చేసేది. ఈ మ‌ధ్య సినిమాలు త‌గ్గించి వివాదాల‌లో ఎక్కువ‌గా నిలుస్తుంది. ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీ ఇష్యూలో అరెస్ట్ అయ్యి నానా హంగామా సృష్టించింది. ఈ వివాదంతో హేమ పేరు

  • By: sn    cinema    Aug 14, 2024 12:54 PM IST
Hema| హేమ మామూల్ది కాదు.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టేస్తుందిగా…!

Hema| న‌టి హేమ ఒక‌ప్పుడు ప్ర‌తి సినిమాలో స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో క‌నిపించేది.ముఖ్యంగా బ్ర‌హ్మనందం కాంబినేష‌న్‌లో ఆమె క‌నిపించి సంద‌డి చేసేది. ఈ మ‌ధ్య సినిమాలు త‌గ్గించి వివాదాల‌లో ఎక్కువ‌గా నిలుస్తుంది. ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీ ఇష్యూలో అరెస్ట్ అయ్యి నానా హంగామా సృష్టించింది. ఈ వివాదంతో హేమ పేరు క‌న్న‌డ వ‌ర‌కు వెళ్లింది. అయితే తాను రేవ్ పార్టీలో లేన‌ని, అస‌లు అక్క‌డికి వెళ్ల‌కుండా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నట్టు ఏవో క‌థ‌లు అల్లింది. కాని టెస్ట్‌ల‌లో పాజిటివ్‌గా రావ‌డంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తరువాత ఆమె బెయిల్ మీద‌ రావడం మ‌నం చూశాం. బ‌య‌ట‌కు వ‌చ్చాక మీడియాతో అంటి ముట్ట‌న‌ట్టుగా ఉన్న హేమ తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్ జాఫర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో తాను అసలు రేవ్ పార్టీకి వెళ్లలేదని.. బర్త్ డేపార్టీ కోసం అని కేక్ తినడానికి వెళ్తే.. డ్రగ్స్ తీసుకుందని తప్పుడు కథనాలు ప్రసారం చేశారని పేర్కొంది. అప్పుడు జాఫ‌ర్.. శాంపిల్స్ పాజిటివ్ ఎందుకు వచ్చాయి? హైదరాబాద్‌లో ఉన్నట్టుగా ఎందుకు వీడియోలు చేశారు, పోలీసులు ఎందుకు చేశారు అంటూ జాఫర్ ప్ర‌శ్న‌లు వేయ‌గా, వాటికి స్పందించిన హేమ‌.. అవన్నీ కోర్టు మ్యాటర్స్.. తీర్పు వచ్చిన తరువాత మాట్లాడతానని.. తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని.. మీడియా వాళ్లే అలా చూపించారంటూ హేమ పేర్కొంది. ఇక జ‌న‌సేన ప్రస్తావ‌న రావ‌డంతో తాను కాపు అని జై జ‌న‌సేన అని చెప్పుకొచ్చింది. నేను పక్కా కాపుని.. కాపుల ఐకమత్యం వర్ధిల్లాలి’ అని అంటోంది హేమ.

పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఆనందాన్నినాకు మిగ‌ల్చ‌లేదు. ఆయ‌న గెలిచాక జై జనసేన అని . జై కాపు.. కాపుల ఐకమత్యం వర్ధిల్లాలి అని అరవాలని అనుకున్నాను అంటూ తెగ ప్రేమ కురిపించింది. అయితే 2019 ఏప్రిల్ నెల‌లో యాంక‌ర్ శ్యామ‌ల‌తో పాటు హేమ కూడా జ‌గ‌న్‌ని క‌లిసి ఆ పార్టీలో చేరింది. ఎన్నిక‌ల‌కి ముందు కూడా వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉంది. ఇప్పుడేమా తాను కాపు అని, జై జ‌న‌సేన అని అంటుంది. మ‌రి ఇవన్నీ వైసీపీలో చేరే ముందు హేమ‌కి ఎందుకు గుర్తు రాలేదో. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడో లేదో.. సడెన్‌గా హేమ పార్టీ మార్చేసి జై జనసేన.. జై జై జనసేన అంటుంది.