Tollywood|చిరంజీవి- మ‌హేష్ బాబు కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్స్.. అలా ఎలా మిస్ అయ్యాయి..!

Tollywood| ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ హంగామా ఎక్కువ‌గా న‌డుస్తుంది. పెద్ద హీరోలు సైతం మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇందులో కొన్ని చిత్రాలు సూప‌ర్ హిట్ కాగా, మ‌రి కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బా

  • By: sn    cinema    Aug 29, 2024 7:00 PM IST
Tollywood|చిరంజీవి- మ‌హేష్ బాబు కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్స్.. అలా ఎలా మిస్ అయ్యాయి..!

Tollywood| ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ హంగామా ఎక్కువ‌గా న‌డుస్తుంది. పెద్ద హీరోలు సైతం మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇందులో కొన్ని చిత్రాలు సూప‌ర్ హిట్ కాగా, మ‌రి కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో కూడా మ‌ల్టీ స్టార‌ర్ రావ‌ల్సి ఉంద‌ట‌. కాని కొన్ని కార‌ణాల వ‌ల‌న అవి అట‌కెక్కాయి. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చిరంజీవి, మ‌హేష్ బాబుల‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇద్ద‌రికి రెండు తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా బ‌య‌ట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

చిరంజీవి, మ‌హేష్ బాబులు గ‌తంలో విడివిడిగా మల్టీ స్టారర్ మూవీస్ చేసినవారు. మహేష్ బాబు అయితే వెంకటేష్ తో కలిసి చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేయ‌గా, ఈచిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక చిరంజీవి కూడా రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ల్టీ స్టారర్స్ చేశారు. చిరంజీవి, మ‌హేష్ బాబుతో మాత్రం మల్టీ స్టారర్ సినిమా రెండు సార్లు మిస్ అయ్యింది. ఒక సారి నిర్మాత సుబ్బిరామిరెడ్డి మెగా హీరోలు అయిన చిరు- పవన్ లతో మల్టీ స్టారర్ చేయాలి అనుకొని, అది కుద‌ర‌క‌పోవ‌డంతో ప‌వన్ స్థానంలో మహేష్ బాబును తీసుకుని చేయాలి అనుకున్నాడట. ద‌ర్శకుడిగా త్రివిక్ర‌మ్‌ని అనుకున్నాడ‌ట‌. కాని క‌థ కుదరక త్రివిక్రమ్ ఈమూవీని తరువాత చేద్దామని సలహా ఇచ్చారట . ఈ సినిమా అలా అలానే మరుగున పడిపోయింది.

ఇక రెండో సారి కూడా వీరి కాంబోలో సినిమా మిస్ అయ్యింది. చిరంజీవి హీరోగా కొరటా శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌కి బ‌దులుగా మ‌హేష్ బాబుని తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. మ‌హేష్ బాబుకి కొర‌టాల క‌థ కూడా చెప్పాడ‌ట‌. అయితే చిత్రంలో ఆచార్యగా చిరంజీవి.. సిద్ద పాత్ర కోసం రామ్ చరణ్ కావాలని మెగాస్టార్ పట్టుబట్టి రామ్ చరణ్ తో ఈ పాత్ర చేయించారట. ఆ సినిమా స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ ట్రిపుల్ ఆర్ చిత్రంత బిజీగా ఉన్నా కూడా రాజ‌మౌళిని డేట్స్ అడిగి మ‌రి ఆచార్య సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌ని న‌టింప‌జేశారు. లేదంటే ఆ స్థానంలో మ‌హేష్ బాబు న‌టించి ఉండేవాడు. అలా రెండు సార్లు ఇలా వీరి కాంబో మిస్ అయ్యిందట. ముందు ముందు కూడా వీరి కాంబినేషన్ కనిపించే అవకాశం లేదు అని చెప్పాలి.