Bigg Boss8|లవ్ అంటూ యష్మీ వెనక తిరిగిన గౌతమ్ ఇప్పుడు అక్కా అనేశాడేంటి.. నామినేషన్ లిస్ట్ పెద్దదే.!
Bigg Boss8|బిగ్ బాస్ హౌజ్‌లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ చాలా వైల్డ్‌గా మారుతున్నారు. మొదట్లో కాస్త రిలేషన్ షిప్ ఏర్పరచుకునే ప్రయత్నం చేయగా, ఇప్పుడు వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఇక అవినాష్ కడుపులో నొప్పితో బయటకు వెళుతున్నట్టు ఆదివారం ప్రోమోలో చూపించారు. ఆ సమయంలో చాలా మం

Bigg Boss8|బిగ్ బాస్ హౌజ్‌లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ చాలా వైల్డ్‌గా మారుతున్నారు. మొదట్లో కాస్త రిలేషన్ షిప్ ఏర్పరచుకునే ప్రయత్నం చేయగా, ఇప్పుడు వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఇక అవినాష్(Avinash) కడుపులో నొప్పితో బయటకు వెళుతున్నట్టు ఆదివారం ప్రోమోలో చూపించారు. ఆ సమయంలో చాలా మంది కన్నీరు కూడా పెట్టుకున్నారు. గంగవ్వ, రోహిణి, నిఖిల్, యష్మి, తేజ, హరితేజ, విష్ణుప్రియా షాక్ అయ్యారు. అనంతరం కాసేపు ట్విస్ట్ అనంతరం మళ్లీ హౌజ్‌లోకి వచ్చి అందరిని ఆనందింపజేశాడు. అవినాష్‌కి స్కానింగ్ చేయించగా, ఫుడ్ పాయిజన్ అయిందిని వైద్యులు తేల్చారు. దీంతో తిరిగి హౌజ్‌లోకి వచ్చేశాడు.
ఇక తొమ్మిదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తిగా జరిగింది. మెగా చీఫ్ అయిన విష్ణుప్రియకు ఈ వారం ఏకంగా సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్(Bigg Boss). ఈ వారం ఏకంగా ఐదుగురుని నామినేట్ చేసే అవకాశాన్ని విష్ణుప్రియకు ఇవ్వడంతో ముందుగా ఐదుగురుని నామినేట్ చేసింది. వారిలో తను మెగా చీఫ్ కావడానికి కారణమైన గౌతమ్, నబీల్ ఇద్దరికి వెన్నుపోటు పొడిచినట్లు అయింది.గౌతమ్‌ని నామినేట్ చేసే సమయంలో యష్మి ప్రస్తావన తీసుకు వచ్చింది. ఈ సమయంలో అక్కా అక్కా అంటూ యష్మిని సంభోదించడం హైలైట్‌గా నిలిచింది. దీనికి ఆమె ఫ్రస్టేట్ అయ్యింది. తనని అలా పిలవొద్దంటూ వాదించింది.
ఆమెని మరింతగా రెచ్చగొట్టాడు గౌతమ్. మొత్తంగా తన లవ్‌ని యాక్సెప్ట్ చేయనందుకు గౌతమ్ మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు. ఆమెపై కోపం ఉందనే విషయాన్ని ఇలా అక్కా అక్కా అంటూ తీర్చేసుకున్నాడు గౌతమ్. వీరిద్దరి మధ్య కాసేపు గట్టిగానే వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మధ్యలో జైలు కీస్ పెట్టి అది అందుకున్న వాళ్లు ఒకరి నామినేట్ నుంచి తప్పించి వారికి బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. అక్కడ మరో కండీషన్ కూడా పెట్టాడు. ఒకసారి కీస్ తీసుకున్నవాళ్లు మరోసారి తీసుకోకూడదని, ఆటలో విష్ణు పాల్గొనకూడదని, మెగా చీఫ్(Mega Chief) కారణంగా తనను నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ కండిషన్స్ పెట్టాడు. పృథ్వీ కీస్ అందుకోగా, నబీల్‌ను సేవ్ చేసి అవినాష్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యష్మీ.. ప్రేరణను కాపాడి, హరితేజను నామినేట్ చేసింది. తర్వాత కీస్ అందుకున్న రోహిణి.. అవినాష్‌ను సేవ్ చేసి పృథ్వీని జైలులో పెట్టింది. అనంతరం టేస్టీ తేజను కాపాడిన అవినాష్ యష్మీని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ పృథ్వీని కాపాడి మళ్లీ టేస్టీ తేజను నామినేట్ చేసింది.మొత్తంగ తొమ్మిదో వారంలో గౌతమ్ కృష్ణ, నయని పావని, హరితేజ, యష్మీ గౌడ, టేస్టీ తేజ నామినేషన్‌లో ఉన్నారు..