Isha Ambani| ఇషా అంబాని లెహంగాపై సంస్కృత శ్లోకం.. దాని అర్ధం మీకు తెలుసా?
Isha Ambani| ఇప్పుడు అందరు కూడా అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక గురించి ముచ్చటించుకుంటున్నారు. ఈ పెళ్లికి ఎంత ఖర్చైంది, ఎవరెవరు హాజరయ్యారు, భోజనాలు ఏమేమి పెట్టారు వంటి విషయాల గురించి ముచ్చటించుకున్నారు. మరోవైపు ఎవరెవరు ఏయే దుస్తులు ధరిం

Isha Ambani| ఇప్పుడు అందరు కూడా అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక గురించి ముచ్చటించుకుంటున్నారు. ఈ పెళ్లికి ఎంత ఖర్చైంది, ఎవరెవరు హాజరయ్యారు, భోజనాలు ఏమేమి పెట్టారు వంటి విషయాల గురించి ముచ్చటించుకున్నారు. మరోవైపు ఎవరెవరు ఏయే దుస్తులు ధరించారు అన్న విషయాలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. ఒరిజినల్ బంగారంతో కూడిన డ్రెస్‌ని రాధిక మర్చంట్ ధరించగా, నీతా అంబాని బనారసీ సిల్క్ ఘాగ్రా ధరించారు. ఈ దుస్తులను అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. బంగారాన్ని పొదిగిన రూ.కోట్ల విలువైన ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు పెళ్ళికి ముందు ముంబైలోని తమ విలాసవంతమైన నివాసం యాంటిలియాలో అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన శివశక్తి పూజలో ఇషా అంబానీ ధరించిన లెహంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆధునికతని జోడిస్తూ ప్రత్యేకంగా ఇషా లెహంగా తయారు చేయించుకుంది. హస్తకళలు, నేత పద్ధతులు అనుసరిస్తూ ప్రత్యేకంగా కనిపించే విధంగా ఇషా అంబానీ ఈ లెహంగాను తయారు చేయించారు. మరోవైపు సంప్రదాయబద్ధంగా కనిపించే విధంగా దీనిపై వేదమంత్రాలు కూడా ఇందులో ఇనుమడింపచేయడం విశేషం. లెహంగాలోని ప్రతి భాగాన్ని అద్భుతమైన రీతిలో రూపొందించారు. ఢిల్లీకి చెందిన వింటేజ్ కో ఈ సాంప్రదాయమైన లెహంగాని రూపొందించింది. ఈ లెహంగాను ‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే థీమ్ తో రూపొందించారు. ఈ లెహంగా ఎంతో ఆకర్షణీయంగా, సాంస్కృతికంగా, సమకాలీనంగా ఉంది. ఇక దీనిపై ట్రీ ఆఫ్ లైఫ డిజైన్ లో నంది కూర్చున్న బొమ్మలు, ఒక వైపు ఆలయం, మరొక వైపు సామరస్యం, సమతుల్యతను సూచించే పక్షులు కూడా మనం గమనించవచ్చు.
కళాత్మక అంశాలు, కుట్టు పద్దతులు, పాతకాలపు ఆకృతితో కూడిన వస్త్రాన్ని ఎంచుకోగా, దీనిపై పురాతన నాణేలు, పాతకాలపు అలంకారాలతో దీన్ని అందంగా రూపొందించారు. శివ శక్తి పూజ రోజు పూజకు సరిగా సరిపోయే విధంగా వేద మంత్రాలతో కూడిన డ్రెస్ ధరించి ఇషా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లెహంగా అంచుల దగ్గర భగవద్గీతలోని శక్తివంతమైన శ్లోకాన్ని ముద్రించారు. “కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదా చన” అనే శ్లోకం ఈ లెహంగా అంచుల మీద కనిపిస్తుంది. దీని అర్థం “ఏదైన పని చేసే హక్కు మీకు ఉంది, కానీ ఆ చర్యల ఫలాలను పొందేందుకు అర్హులు కాదు” అని దీని అర్థం. ఈ లెహంగా పూర్తి చేసేందుకు సుమారు 4000 గంటల సమయం పట్టింది. శివశక్తి పూజ వేడుకలో ఇషా ఈ లెహంగాలో కనిపించి తన అద్భుతమైన అభిరుచిని, సంప్రదాయాన్ని తెలియజేసింది.