Jagapathi Babu : ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో హోస్టుగా జగపతి బాబు!

జగపతి బాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో ఆగస్టు 17 నుంచి జీ తెలుగు, ZEE5లో ప్రారంభం. తొలి అతిథి నాగార్జున జ్ఞాపకాలు పంచుకోనున్నారు.

Jagapathi Babu : ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో హోస్టుగా జగపతి బాబు!

Jagapathi Babu | విధాత : టాలీవుడ్ సీనియర్ హీరో..విలన్ జగపతి బాబు(Jagapathi Babu) త్వరలో బుల్లితెరపై ఓ టాక్ షో లో హోస్ట్ గా అభిమానులను అలరించబోతున్నారు. ఆగస్టు 17వ తేది నుంచి జీ తెలుగు(Zee Telugu), జీ5లో(Zee5) ప్రసారం కానున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammura) టాక్ షోలో హోస్ట్ పాత్రలో జగపతిబాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఈ షో ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ టాక్ షోకు మొదటి అతిథిగా టాలీవుడ్ సీనియర్ హీరోఅక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హాజరవుతున్నారు. ఈ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టాక్ షోకు ట్యాగ్ లైన్ ‘ చిరునవ్వులతో సాగే ఈ కొత్త ప్రయాణం’ అని జోడించారు.

‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammura) విత్ జగపతిబాబు తొలి షోలో నాగార్జున తన చిన్ననాటి జ్ఞాపకాలు, వ్యక్తిగత వివరాలు, విలువైన కుటుంబం జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నాగార్జునతో పాటు ఆయన బ్రదర్ వెంకట్, సిస్టర్ నాగ సుశీల ల సరదా సంభాషణలతో ఈ షోను రక్తికట్టించబోతున్నారు. ఈ టాక్ షో లో పాల్గొనే అతిథుల నుంచి ఎప్పుడూ వినని విశేషాలను జగపతి బాబు అభిమానుల ముందుంచుతారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఒక టాక్ షో మాత్రమే కాదు .. ఒక కొత్త ప్రయాణం. ఈ షోకు వచ్చే అతిథులు తమ మనసులోని భావాలను పంచుకోవడంతో పాటు తమ జీవిత ప్రయాణంలో జరిగిన సంఘటనలు, మరుపురాని ఘట్టాలను గుర్తుచేసుకోవడానికి ఒక వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు ప్రోమోలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి…

జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో మెరుపు వరదలు..22మంది మృతి

జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైసీపీకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు