Devara Movie | జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది.. రొమాన్స్‌ మామూలుగా లేదుగా

జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న 'దేవర' చిత్రంలోని సెకెండ్‌ సింగిల్‌ను సోమవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది

Devara Movie | జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది.. రొమాన్స్‌ మామూలుగా లేదుగా

విధాత, హైదరామాద్ : జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలోని సెకెండ్‌ సింగిల్‌ను సోమవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది. ‘చుట్టమల్లే చుటేస్తాంది.. తుంటరి చూపు.. ఉరికే ఉండదు కాసేపు’ అంటూ సాగే పాటను అనిరుద్‌ సంగీత సారధ్యంలో శిల్పారావు ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

సముద్ర తీరాన ఎన్టీఆర్‌, జాన్వీల ఆటపాటలతో సాగిన ఈ గీతం వీక్షకులను అలరిస్తు వైరల్‌గా మారుతుంది. జాన్వీ అందాలు..పాట చిత్రీకరణ తీరు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. దేవర చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్‌ను సెప్టెంబర్‌ 27న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

పల్లవి

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాస్సేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు

రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేసా
నీ రాకకు రంగం సిద్ధం చేశా

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది

చరణం

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి
వాస్తుగా పెంచానిట్ఠా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ

చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమేలే నీ సందడి
ముట్టడించి ముట్టేసుకోలేవ
ఓసారి చెయిజారి

రా ఏ బంగరు నక్లీసు. నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది