The Paradise: నాని.. ‘ది పార‌డైజ్‌’ రా స్టేట్‌మెంట్‌! మ‌రి ఇంత ప‌చ్చిగానా

  • By: sr    latest    Mar 03, 2025 1:32 PM IST
The Paradise: నాని.. ‘ది పార‌డైజ్‌’ రా స్టేట్‌మెంట్‌! మ‌రి ఇంత ప‌చ్చిగానా

విధాత‌: నాచుర‌ల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేష‌న్‌లో ద‌స‌రా వంటి క్లాసిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత తెరెక్కుతున్న రెండో చిత్రం ది పార‌డైజ్‌(The Paradise). SLV సినిమాస్ (SLV Cinemas)బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ తాజాగా రా స్టేట్‌మెంట్‌ కీల‌క అప్డేట్ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం 2026 మార్చి 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో పాటు తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌తో పాటుగా ఇంగ్లీష్‌, స్పానీష్ భాష‌ల్లోనూ రిలీజ్ చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రిలీజ్ చేసిన గ్లిమ్స్‌ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ముఖ్యంగా గ్లిమ్స్‌లో నాని లుక్‌, బ్యాగ్రౌండ్‌లో వ‌చ్చే డైలాగ్స్ స్ట‌న్నింగ్‌గా ఉన్నాయి. అనిరుధ్ (Anirudh) సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌సోనాలి కుల‌క‌ర్ణి (Sonali Kulkarni ) కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.