KALKI 2898 AD|కల్కి సరికొత్త రికార్డ్..హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఏడో స్థానం..!
KALKI 2898 AD| గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.1054 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో ఇండియన్ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఏడో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు 2024 ఏడాదిలో హ

KALKI 2898 AD| గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.1054 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో ఇండియన్ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఏడో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు 2024 ఏడాదిలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో కల్కి మూవీ తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లకుపైగా గ్రాస్‌ను, 182 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటకలో 77 కోట్లు, తమిళనాడులో 45 కోట్లు, కేరళలో 33 కోట్ల వరకు కల్కి మూవీ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో కూడా కల్కి చిత్రం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. నైజాం ఏరియాలో కల్కి 2898 ఏడీ థియేట్రికల్ రైట్స్ దాదాపు 65 కోట్లకు అమ్ముడుపోగా… యాభై రోజుల్లో ఈ సినిమాకు 92 కోట్ల కలెక్షన్స్ రావడంతో ఒక్క నైజాం ఏరియాలోనే ప్రభాస్ మూవీకి 27 కోట్లకుపైగా లాభాలు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇండియన్ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్‌లో దంగల్ తొలిస్థానంలో ఉండగా, ఈ మూవీ 1970 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ప్లేస్‌లో రాజమౌళి బాహుబలి 2 (1800 కోట్లు), ఆర్ఆర్ఆర్ (1271 కోట్లు) కలెక్షన్స్ దక్కించుకున్నాయి. కేజీఎఫ్ 2 (1230 కోట్లు), షారుఖ్‌ఖాన్ జవాన్ (1160 కోట్లు), పఠాన్ (1060 కోట్లు) తర్వాత ప్లేస్‌లో కల్కి 2898 ఏడీ నిలవడం విశేషం. మొత్తానికి తెలుగులో రాజమౌళి సినిమాల తర్వాత వెయ్యి కోట్ల ఘనతను సాధించిన తొలి చిత్రంగా కల్కి నిలిచింది.
ఇక ఈ మూవీని కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ఫిక్షనల్ వరల్డ్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించాడు. గురువారం నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోను స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. కల్కి మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ పాత్ర పోషించనున్నాడు. సెకండ్ పార్ట్‌లో కర్ణుడి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది. కల్కి సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటికే 30 శాతం వరకు షూటింగ్ పూర్తి కాగా, మిగతా పార్ట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.