Kalki| బుక్ మై షోలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్ ప్రభాస్ సొంతం.. అదేంటంటే..!
Kalki| ప్రభాస్ వరుస ఫ్లాపుల తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆయన నటించిన సలార్ చిత్రం పెద్ద విజయం అందుకోగా, ఆ తర్వాత వచ్చిన కల్కి చిత్రం కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. కల్కి చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాకి ఎంతో ఆదరణ లభించింది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇంత భారీ విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానులతో పాటు కల్కీ చిత్ర యూనిట్

Kalki| ప్రభాస్ వరుస ఫ్లాపుల తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆయన నటించిన సలార్ చిత్రం పెద్ద విజయం అందుకోగా, ఆ తర్వాత వచ్చిన కల్కి చిత్రం కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. కల్కి చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాకి ఎంతో ఆదరణ లభించింది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇంత భారీ విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానులతో పాటు కల్కీ చిత్ర యూనిట్ కూడా అమితమైన ఆనందం చూపిస్తుంది. చాలా ఏరియాలలో కూడా కల్కి మూవీ పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా కల్కి మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది.
అయితే కల్కి సినిమా మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మూవీ టికెట్స్ బుక్ చేసుకునే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్ మై షోలో రిలీజ్ కి ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజు నుంచి నిన్నటి వరకు కూడా అత్యధిక టిక్కెట్స్ సేల్ అవుతూ ఉన్నాయి. చిత్రం రిలీజ్ అయి మూడు రోజులు అవుతున్నా కూడా కల్కి మూవీ రికార్డ్ రేంజ్‌లో టిక్కెట్ల సేల్స్ దక్కించుకుంటుంది. కల్కి టికెట్ బుకింగ్స్ జూన్ 23న ఓపెన్ చేయగా ఆ రోజు 328K అంటే ఆల్మోస్ట్ 3 లక్షల 28 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇక కల్కి సినిమా రిలీజ్ రోజు జూన్ 27న ఏకంగా 11 లక్షల 20 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. రిలీజ్ తర్వాత రోజు ఏకంగా 11 లక్షల 72 వేల టికెట్స్ అమ్ముడు పోయినట్టు తెలియజేసింది.
సినిమా రిలీజయి మూడు వారాల తర్వాత కూడా నిన్న జులై 17న 1 లక్ష 28వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ నుంచే మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడు కావడంతో కల్కి సినిమా ఊహించని విధంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్‌మై షోలో ఈ రేంజ్ టిక్కెట్ సేల్స్ కావడం ఇదే తొలిసారి. ఒక్క బుక్ మై షోలోనే కల్కి హవా ఈ రేంజ్‌లో ఉంటే ఇతర టికెట్ యాప్స్, డైరెక్ట్ గా థియేటర్స్ వద్ద కలిపి ఇంకెన్ని టికెట్స్ అమ్ముడు పోయి ఉంటాయా అని అందరు ఆలోచనలు చేస్తున్నారు.