Kalki | కల్కి టీమ్‌కు లీగల్ నోటీసులు ఇచ్చిన కల్కి పీఠాధిపతి

కల్కి మూవీ టీమ్ కు కల్కి పీఠాధిపతి లీగల్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. హిందువుల మతపరమైన మనోభావాలను కల్కి చిత్ర కథనం దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబ్ బచ్చన్‌తో సహా 'కల్కి 2898 ఏడీ' నిర్మాతలకు, నటులకు పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసు పంపారు

Kalki | కల్కి టీమ్‌కు లీగల్ నోటీసులు ఇచ్చిన కల్కి పీఠాధిపతి

విధాత, హైదరాబాద్ : కల్కి మూవీ టీమ్ కు కల్కి పీఠాధిపతి లీగల్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. హిందువుల మతపరమైన మనోభావాలను కల్కి చిత్ర కథనం దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబ్ బచ్చన్‌తో సహా ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాతలకు, నటులకు పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసు పంపారు.

ఆచార్య ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ కల్కి నారాయణ భగవానుడు మన విశ్వాసానికి కేంద్రంగా నిలిచాడన్నారు. “సనాతన గ్రంథాలను మార్చకూడదని, సినిమాలో కల్కి భగవానుడి గూర్చి గ్రంథాలకు భిన్నంగా, తప్పుగా చూపించారన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమావాళ్లకు కాలక్షేపంగా మారిందని, ఇక సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి(దీపిక) కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లుగా చూపించి వందల కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని నోటీస్‌లో ఆరోపించారు.