Garikapati | కల్కి సినిమాపై మండిపడ్డ గరికపాటి నరసింహరావు.. డైలాగ్స్‌ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారంటూ ఆగ్రహం..!

Garikapati | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సీనియర్ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విశ్వనటుడు కమల్‌ హసన్‌ (Kamal Haasan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani) నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

Garikapati | కల్కి సినిమాపై మండిపడ్డ గరికపాటి నరసింహరావు.. డైలాగ్స్‌ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారంటూ ఆగ్రహం..!

Garikapati | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సీనియర్ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విశ్వనటుడు కమల్‌ హసన్‌ (Kamal Haasan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani) నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీ రిలీజ్‌ ఆ తర్వాత చాలామంది మహాభారతం (Mahabharatam), అందులోని పాత్రల గురించి తెలుసుకునే ప్రయత్నించారు. అయితే, దాంతో ఈ మూవీ జనాలపై ఎంతటి ప్రభావం చూపించిందో తెలుస్తున్నది. అయితే, కల్కి మూవీ.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గరికపాటి ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రవచించారు.

ఇందులో కల్కి మూవీపై స్పందించారు. మూవీలో అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, అర్జునుడిగా విజయ్‌ దేవరకొండ నటించారు. ఇక ప్రభాస్‌ కర్ణుడిగా కనిపించాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడి అస్త్రాల ధాటికి అశ్వత్థామ పడిపోయి ఇబ్బందిపడుతుంటాడు. ఈ సమయంలో కర్ణుడు ఎంట్రీ ఇచ్చి ‘ఆలస్యమైందా? ఆచార్యపుత్రా’ అంటూ ప్రభాస్‌ కర్ణుడిగా ఎంట్రీ ఇస్తాడు. ఈ సీన్‌ సినిమాలో ఓ రేంజ్‌లో హైప్‌ చేసింది. ఈ సీన్‌పై గరికపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్కి మూవీలో చూపించినట్లుగా రియల్‌గా అశ్వత్థామ.. కర్ణులే హీరోలు అయ్యారంటూ సెటైర్లు వేశారు. అశ్వత్థామ వీరుడని సైతం వీరుడేనని.. కర్ణుడిని ఆయన ఎన్నోసార్లు కాపాడాడని చెప్పారు. కల్కి మూవీతో శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జునుడు, భీముడు వంటి గొప్పవాళ్లు సైతం వారిద్దరి ముందు తక్కువగా చూపించారన్నారు. సినిమా వారంతా ఎలాపడితే అలా డైలాగ్స్‌ రాసుకుంటారని.. అసలైన మూల మహాభారతం చదివితే ఎవరు ఏంటో తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

Janhvi Kapoor | టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన జాన్వీ కపూర్‌..! రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందిగా..!