Kamal Haasan| ఏంటి భార‌తీయుడు 2 బాగుండదా.. క‌మ‌ల్ కామెంట్స్‌కి అంద‌రు షాక్

Kamal Haasan| లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన భార‌తీయుడు2 చిత్రం ఈ నెల‌12న విడుద‌ల కానుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచారు. ఈ క్ర‌మంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రంకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. ఆదివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌మ‌ల్ హాస‌న్ ఆస‌క్తిక‌

  • By: sn    cinema    Jul 08, 2024 7:30 AM IST
Kamal Haasan| ఏంటి భార‌తీయుడు 2 బాగుండదా.. క‌మ‌ల్ కామెంట్స్‌కి అంద‌రు షాక్

Kamal Haasan| లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన భార‌తీయుడు2 చిత్రం ఈ నెల‌12న విడుద‌ల కానుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచారు. ఈ క్ర‌మంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రంకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. ఆదివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌మ‌ల్ హాస‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కి నేను ముందుగా ఏం చెప్పాల‌ని ఆలోచిస్తే కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డ‌మే క‌రెక్ట్ అని అనిపిస్తుంది. మూడు త‌రాలుగా మీరు న‌న్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ ఇంత దూరం తీసుకు వ‌చ్చారు. 52 ఏళ్ల క్రితం నేను టెక్నీషియ‌న్‌గా మొద‌టిసారి హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇలాంటి వేదిక‌లు దొరుకుతాయ‌ని అస్స‌లు ఊహించ‌లేదు.

ఇక 28 ఏళ్ల కిందట భారతీయుడు వచ్చినప్పుడు నేను గానీ, శంకర్ గాని ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. కె.బాలచందర్, కె.విశ్వనాథ్, శంకర్ వంటి దర్శకులు నాకు మంచి హిట్స్ ఇచ్చి ఇంత వాడిని చేశారు. అయితే నాకు ద‌ర్శ‌కులు శంకర్ నాకు ఒక ఆదేశం ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్లినా భారతీయుడు-3 గురించే మాట్లాడుతున్నారు అలా మాట్లాడితే అంద‌రు భారతీయుడు-2 బాగాలేదని అనుకుంటారు… అందుకే భారతీయుడు-2 గురించే మాట్లాడాలని ఉత్తర్వులు ఇచ్చారు. భారతీయుడు-2నే భారతీయుడు-3… భారతీయుడు-3నే భారతీయుడు-2 అని క‌మ‌ల్ హాస‌న్ అన్నారు

ఇక ఈ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మానందం ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తాజ్ మహల్‌ని చూసినప్పుడు అందంగా ఉంటుందని అంటాం.. ఐఫిల్ టవర్‌ను చూసినప్పుడు ఎంత పొడవుగా ఉందో అని అంటాం.. అలానే మనం కమల్ హాసన్ గారిని చూసినప్పుడు.. ఆయన ముందు ఉన్నప్పుడు.. ఎంత గొప్ప నటుడో అని అనక త‌ప్ప‌దు. సాగ‌ర సంగ‌మం సినిమా స‌మ‌యంలో ఆయ‌న శ‌రీరంలోని ప్ర‌తి అణువు న‌టించింద‌ని, అలా న‌టించగ‌లిగే ఒకే ఒక్క న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అంటూ బ్ర‌హ్మానందం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇక భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీదే కమల్ హాసన్‌లా మిమిక్రీ చేసి బ్ర‌హ్మానందం అల‌రించారు. బ్రహ్మానందం అలా మిమిక్రీ చేస్తుంటే కమల్ హాసన్ తెగ మురిసిపోయాడు.