Online Harrasment : ఫేస్ బుక్ లో వేధిస్తున్నాడు..సీరియల్ నటి పిర్యాదు
ఫేస్‌బుక్‌లో వేధింపులు తాళలేక సీరియల్ నటి పోలీసులను ఆశ్రయించింది. ఫేక్ అకౌంట్లతో వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విధాత : ఆన్ లైన్ మోసాలు, వేధింపుల బారిన పడిన ఓ సీరియల్ నటి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఫేస్‌బుక్ వేదికగా తనను వేధిస్తోన్న యువకుడిపై కన్నడ, తెలుగు సీరియల్ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు నవీన్ అనే వ్యక్తి నుంచి సీరియల్ నటికి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె తిరస్కరించడంతో అతడు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో నటి అతడిని బ్లాక్ చేశారు.
అయినా నిందితుడు నవీన్ ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసి వాటినుంచి నటికి సందేశాలు పంపుతున్నాడు. నంబర్ బ్లాక్ చేసిన ఆగకుండా..ఫేక్ అకౌంట్లతో నిందితుడు పంపుతున్న అసభ్య సందేశాలతో మానసిక క్షోభకు గురైన నటి పోలీసులను ఆశ్రయించారు. నటి ఫిర్యాదు మేరకు విచాణర చేపట్టిన అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram