7-Foot Tall Woman In Tirumala : తిరుమల క్యూలైన్లలో పొడగరి మహిళ.. ఎవరంటే..!?
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలోకి వచ్చిన ఏడు అడుగులకు పైగా ఎత్తు ఉన్న మహిళా భక్తురాలు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె శ్రీలంకకు చెందిన నెట్‌బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగంగా గుర్తించారు.
                                    
            విధాత: ఓ పొడుగు మహిళ తిరుమల శ్రీవారి క్యూలైన్లలో సందడి చేసింది. తిరుమలలోవానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు ఏడు అడుగులకుపైగా ఉన్న ఓ ఎత్తైన మహిళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో ఇతర భక్తుల కంటే భిన్నంగా పొడుగ్గా ఉన్న ఆ మహిళను భక్తులు ఆసక్తిగా చూశారు. బాబోయ్ ఎంత పొడుగ్గా ఉందో అనుకుంటూ.. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.
ఇంతకీ ఆ పొడగిరి మహిళ ఎవరన్న వివరాల్లోకి వెళితే ఆమో మాజీ నెట్ బాల్ క్రీడాకారిణి. శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం ఆటకు చాన్నాళ్ల క్రితమే రిటైర్మైంట్ ప్రకటించారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు.
బాబోయ్ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి
తిరుమలలోవానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు ఏడు అడుగుల ఎత్తైన మహిళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. శ్రీలంకకు చెందిన నెట్… pic.twitter.com/WJOakJL8LD
— ChotaNews App (@ChotaNewsApp) November 3, 2025
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram