Kiran Abbavaram|కిర‌ణ్ అబ్బ‌వ‌రం పెళ్లిలో క్రేజీ విజువ‌ల్స్.. లీకైన వీడియో

Kiran Abbavaram|టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఎట్ట‌కేల‌కి ఓ ఇంటివాడు అయ్యాడు. గ‌త కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్న ర‌హ‌స్య‌ని వివాహం చేసుకున్నాడు. రాజావారు రాణిగారు అనే చిత్రంతో కిరణ్ హీరోగా పరిచయం కాగా, అందులో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇప్పుడు ఆమెని త‌న రి

  • By: sn    cinema    Aug 23, 2024 7:05 AM IST
Kiran Abbavaram|కిర‌ణ్ అబ్బ‌వ‌రం పెళ్లిలో క్రేజీ విజువ‌ల్స్.. లీకైన వీడియో

Kiran Abbavaram|టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఎట్ట‌కేల‌కి ఓ ఇంటివాడు అయ్యాడు. గ‌త కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్న ర‌హ‌స్య‌ని వివాహం చేసుకున్నాడు. రాజావారు రాణిగారు అనే చిత్రంతో కిరణ్ హీరోగా పరిచయం కాగా, అందులో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇప్పుడు ఆమెని త‌న రియల్ లైఫ్ లో కిరణ్ అబ్బవరం తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి వేడుక గురువారం రోజు కర్ణాటక లోని కూర్గ్ లో అట్ట‌హాసంగా జ‌రిగింది. పెళ్లి వేడుక‌కి సంబంధించిన కొన్ని వీడియోలు బ‌య‌ట‌కి రాగా వాటిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నూత‌న జంట‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కిరణ్ అబ్బవరం. రహస్య వధూవరులుగా ముస్తాబై పెళ్లి మండపానికి తీసుకెళ్ల‌డం, బంధు మిత్రులు వారిని సాంప్రదాయ పద్దతిలో మండపం వద్దకు తీసుకురావ‌డం వంటి స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక పెళ్లిలో కిరణ్ అబ్బవరం సాంప్రదాయ పంచె కట్టులో కనిపించ‌గా, రహస్య గోరఖ్ అయితే పట్టు చీరలో వెలిగిపోయింది ఈ విజువల్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. అంతకు ముందు గత మూడు రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా జరిగాయి. సంగీత్, హల్దీ, మెహందీ.. ఇలా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కిరణ్, రహస్య. అవి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే ఇరు కుటుంబాల‌ పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేశాడు కిరణ్ అబ్బవరం. పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మనోడు మంచి సక్సెస్ కోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ ‘క’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అయిన మంచి హిట్ ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేశారు. అయితే నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమాలో ప్రేమికులుగా నటించిన కిరణ్, రహస్య… నిజ జీవితంలోనూ లవర్స్ గా మారి ఇప్పుడు భార్య‌,భ‌ర్త‌లు అయ్యారు.