మొదటి సినిమా హీరోయిన్‌తో నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కిరణ్ అబ్బవరం

ఈ ఏడాది హీరో, హీరోయిన్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా, త్వరలో తాప్సీ కూడా వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఇటీవల నిశ్చితార్థం జరుపుకుంది. ఆమె పెళ్లి కూడా మరి కొద్ది రోజులలోనే జరగనుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ కుర్ర హీరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. త్వరలోనే మూడుముళ్ల బంధంలోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు.
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ రాజావారు రాణిగారు సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తర్వాత ‘ఎస్సార్ కళ్యాణమండపం’తో కూడా మంచి హిట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న అతను త్వరలో తను ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్‌గా తనతో కలిసి నటించిన రహస్యతో దాదాపు ఐదేళ్లు ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం బుధవారం మార్చి 13 ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని పెళ్లి జీవితానికి మొదటి అడుగు వేయబోతున్నారట.
నిశ్చితార్థం పూర్తైన కొద్ది రోజులకే వారిరివురు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది.అయితే హీరోయిన్ రహస్య గోరక్‌తో కిరణ్ అబ్బkవరం రహస్య ప్రేమాయణం సాగిస్తున్నాడని గత ఐదేళ్లుగా అనేక వార్తలు వస్తున్నా కూడా వీరు స్పందించింది లేదు. కాని సైలెంట్‌గా వీరిద్దరు నిశ్చితార్థ వేడుక జరుపుకోనున్నారని తెలుసుకున్న సినీ ప్రియులు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా రహస్య..రాజావారు రాణిగారు సినిమా తర్వాత ‘సర్బాత్’ అనే తమిళ్ సినిమాతో ఆడియన్స్‌ని పలకరించింది. ఈ చిత్రం తరువాత మళ్ళీ మరో సినిమా చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం అడపాదడపా రచ్చచేస్తూ అలరిస్తూనే ఉంది. గతంలో ఓ షోలో రహస్య గురించి కిరణ్ అబ్బవరం గురించి ప్రశ్నించగా ఆయన తెగ సిగ్గుపడ్డాడు. అయితే కిరణ్ ఇంట జరిగే వేడుకలలో ఆమె అప్పుడప్పుడు సందడి చేస్తూనే ఉంటుంది. కిరణ్ నూతన గృహ ప్రవేశ వేడుకల్లో రహస్య అందరి దృష్టిని ఆకర్షించింది. సీక్రెట్‌గా లవ్ మెయింటైన్ చేసిన ఈ జంట త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటించనున్నారు.