Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం సినిమాల జాబితా అబ్బబ్బో…!
టాలీవుడ్ యూత్ స్టార్ కిరణ్ అబ్బవరం 8 సినిమాలతో బిజీగా ఉంది. 'కె-ర్యాంప్', 'జిగ్రీస్', 'మిర్జాపూర్' వంటి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.
విధాత : స్టార్ డమ్ హీరో కాదు..నట వారసుడు అంతేకంటే కాదు..అయినా టాలీవుడ్(Tollywood) యూత్ హీరోల్లో అతనో క్రేజీ స్టార్ గా ఎదుగుతున్నాడు. అతనే కిరణ అబ్బవరం(Kiran Abbavaram). రాజా వారు రాణి గారు (2019)(Raja Vaaru Rani Gaaru) తో వెండితెర అరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం చిన్న సినిమాలకు పెద్ద హీరోగా మారిపోయాడు. క(KA) సినిమాతో హిట్ కొట్టిన కిరణ అబ్బవరం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్నయూత్ హీరోగా సినీ వర్గాలను అబ్బో అనిపిస్తున్నాడు. అతని చేతిలో దాదాపు 8 సినిమాలు ఉండటం..అవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే కావడంతో కిరణ అబ్బవరం క్రమంగా స్టార్ హీరో దిశగా అడుగులేస్తున్నాడు. ఒకేసారి పలు సినిమాలు చేస్తూ, విభిన్న కథలతో ముందుకు వెళ్తున్న కిరణ్ అబ్బవరం కెరీర్ గ్రాఫ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కె-ర్యాంప్'(K-Ramp) ఆక్టోబర్ 18న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చెన్నై లవ్ స్టోరీ(Chennai Love Story) తో పాటు దర్శకుడు సుకుమార్ శిష్యుడు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ‘జిగ్రీస్'(Jigris) చిత్రంలో నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ‘మిర్జాపూర్’ ఫేమ్ ఆనంద్ అయ్యర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న సినిమా కావడంతో ఇప్పటికే మంచి అంచనాలు పెరిగాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram